ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఒక విషయంలో అటు టిడిపి, వైసిపి పార్టీ మధ్య ఒక వార్ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా హంద్రీనీవా నీటి చుట్టు టిడిపి వైసిపి పార్టీ మధ్య రాజకీయం చాలా ముదురుతోంది. హంద్రీనీవా ద్వారా కుప్పం బ్రాంచ్ కి వెళ్ళే నీళ్లు తెచ్చింది మేమే అంటూ వైసీపీ నేతలు.. చెబుతూ ఉండగా.. 90% పనులను పూర్తి చేశామంటూ తెలిపారు చంద్రబాబు హయాంలో ఇది సాధ్యమైంది అంటూ టిడిపి పార్టీ తెలియజేస్తున్నారు.. ఇలా రెండు పార్టీల మధ్య ఒక మాటలు యుద్ధమే జరుగుతోంది.. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చింది తామే అంటూ చంద్రబాబు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.


దీంతో ఇప్పుడు నీళ్ల లొల్లి కాస్త పొలిటికల్ హీట్ గా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు ఇలాకా కుప్పంలో హంద్రీనీవా నీటి ఇష్యూ హాట్ టాపిక్ గా మారుతోంది.. ఫిబ్రవరి 26న సీఎం వైయస్ జగన్ కుప్పం పర్యటన ఒక్కసారిగా ఆసక్తి పెంచేస్తోంది. కృష్ణా జలాలను పులివెందులకు తెచ్చింది తామేనట్టు చంద్రబాబు చెబుతూ ఉండగా కుప్పంకు నీళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వమే అంటూ వైసీపీ చెప్పుకుంటోంది. 14 ఏళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కుప్పానికి నీళ్లు రాకుండా చేశారని.. మంత్రి పెద్దారెడ్డి, రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసని హంద్రీనీవా నీటిని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసి కుప్పం ప్రజలకు అందిస్తానంటూ కూడా మాట ఇచ్చారని ఆ విధంగా చేశారని తెలిపారు.


ఫిబ్రవరి 26న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ పూజలు చేయించి ఈ నీటిని కుప్పం నియోజకవర్గానికి అందిస్తామంటూ మంత్రి పెద్దారెడ్డి తెలియజేశారు. టిడిపి హయాంలో నాసిరకమైన పనులు చేయించారని అందుకే మీరు ఆలస్యంగా రావడంతో ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసుకున్నారు అంటూ వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇటు కుప్పంలో నీళ్ల విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: