ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలకు సంబంధించి కౌన్ డౌన్ మొదలైంది.. ఇప్పటికే ప్రధాన పార్టీలు సైతం ఈసారి ఎన్నికలలో చాలా వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇన్చార్జిల మార్పు విషయంలో కసరత్తులు చేస్తూ పూర్తి చేసే పనిలో పడ్డారు. సిద్ధం సభలతో ఎన్నికలకు వ్యూహాత్మకంగానే ముందుకు వెళుతున్నారు సీఎం జగన్.. ముఖ్యంగా టిడిపికి పట్టున్న నియోజకవర్గం దృష్టి పెట్టారు.. అలా ఇప్పటివరకు మూడు సభలను చేయక విజయవంతంగా అయ్యాయి ఇప్పుడు నాలుగవ సిద్ధం సభ వేదిక ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.


అయితే ఈ సబే చివరి సభ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సభలో ఎన్నికల వరాలు కూడా ప్రకటించబోతున్నారు.. వైసిపి ఎన్నికలవేళ సిద్ధం సభలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు సభలలో పార్టీలో ఫుల్ జోక్స్ పెరిగిపోయింది భీమిలి దెందులూరు రాప్తాడులో జరిగిన సభలు సైతం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి.. ఇప్పుడు చివరి విడతగా నాలుగవ సభను టిడిపి కంచుకోటలో నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు..


మార్చి రెండవ తేదీన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం లో 200 ఎకరాలలో ఈ సభను నిర్వహించబోతున్నట్లు సమాచారం. జాతీయ రహదారికి దగ్గరగా ఉండే ప్రాంగణంలోనే ఈ సభను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది..ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణ నాలుగు జిల్లాలు ఉమ్మడిగా ఉండడంతో పాటు 54 నియోజకవర్గాల నుంచి ఈ కేడర్ కు హాజరు కాబోతున్నారు. రాప్తాడుకు నిర్వహించిన సభకు మించి ఈ సభ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సభలోని సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటించబోతున్నట్లు సమాచారం.. రైతు రుణమాఫీ పైన రాప్తాడులో ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాల చేత చివరి సభలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. అలాగే మహిళలకు సంబంధించి కీలకమైన ప్రకటనతో పాటు ఇతరత్రా అభ్యర్థులను పథకాలను కూడా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: