ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వైఎస్ షర్మిల దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు షర్మిళ.వైసీపీ పాలనపైనా, జగన్ పనితీరుపైనా  ప్రతీసారీ ఫైరవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిళ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారాయి. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వంతో యుద్దానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేడు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో "ఛలో సెక్రటేరియట్‌"కు పిలుపునివ్వగా.. పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. ఈ క్రమంలోనే బుదవారం నాడు రాత్రి షర్మిల ఆంధ్రరత్న భవన్‌ కు చేరుకుని అక్కడే నిద్రపోయారు.ఈ క్రమంలో డీఎస్సీ నోటిఫికేషన్ పేరు చెప్పి జగన్ మోహన్ రెడ్డిపై షర్మిల నిప్పులు చెరిగారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో అతి పెద్ద సమస్యల్లో ఒకటిగా ఉన్న నిరుద్యోగానికి ఈ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారాలు చూపించిందో చెప్పాలని మొదలుపెట్టిన షర్మిళ  చదువుకున్న చదువులకు ఎటువంటి సంబంధం లేకుండా యువత ఉద్యోగాలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ క్రమంలో సుమారు 21 వేల మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిళ తెలిపారు.


ఇక చంద్రబాబు నాయుడు హయాంలో కూడా యువతకి అన్యాయం జరిగిందని చెప్పిన షర్మిళ హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా... తాము అధికారంలోకి వస్తే లక్షా 43 వేల ఉద్యోగాలు  భర్తీ చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గతంలో మెగా డీఎస్సీ భర్తీ విషయంలో చంద్రబాబును విమర్శించిన జగన్.. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ఇవ్వకుండా దగా డీఎస్సీ ఇచ్చారని షర్మిళ నిప్పులు చెరిగారు.ఇక 23 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి 23వేల పోస్టులకు బదులు కేవలం 7వేల ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారని గుర్తు చేశారు షర్మిళ. మరి ఇప్పుడు మీరు 6వేల ఉద్యోగాలే ఎందుకు వేసారని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ లెక్కన చూసుకుంటే... "మీ కంటే చంద్రబాబు నాయుడే మేలు కదా.. మీ కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలిచ్చారు.. ఆయన కంటే ఘోరం అని మిమ్మల్ని మీరే నిరూపించారు" అంటూ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: