వైసీపీ మంత్రి, విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. తీవ్ర వ్యాఖ్యలతో తెలుగుదేశం కీలక నేతలపై హెచ్చరికలు జారీ చేశారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే ఇంకా ఎస్సీ నేత వంగలపూడి అనితలను 'పరిగెత్తించి.. పరిగెత్తించి కొడతా' అని మంత్రి అమర్నాథ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.పాయకరావుపేటలో మంగళవారం నాడు రాత్రి నిర్వహించిన సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వీరిద్దరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.వైసీపీ నేతలపై అధికారంలోకి వస్తే బదులు తీర్చుకుంటామంటూ లోకేష్ ఎర్ర పుస్తకాల్లో రాసుకుంటున్నాడని, తమకు, తమ పార్టీ కార్యకర్తలకు పుస్తకాలు అవసరం లేదని మంత్రి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.ఇక ఏదైనా తేడా వస్తే పరిగెత్తించి కొడతానని మంత్రి హెచ్చరించారు. ముఖ్యంగా సీఎం జగన్‌, ఆయన భార్య భారతిపైన తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిగెత్తించి కొట్టడం ఖాయమని వెల్లడించారు.వంగలపూడి అనిత గురించి తాను మాట్లాడితే ఆమె రేంజ్ పెరుగుతుందని మంత్రి అన్నారు.


ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. అనిత, లోకేష్ ని తీసుకొచ్చి నియోజకవర్గంలో తిప్పిందని, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని గుడివాడ అన్నారు. మాజీ ఎమ్మెల్యే అనిత కోసం మాట్లాడితే ఆవిడ రేంజ్ పెరుగుతుందని, అది తనకు ఇష్టం లేదన్న గుడివాడ అమర్నాథ్.. బాగా మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్‌, ఆయన భార్య గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, ఇలాంటి మాటలు మానుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ఈ నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.నిరుపేదలకు అండగా ఉండేలా గడిచిన 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించడం జరిగింది. తెలుగు దేశం నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. తెలుగు దేశం పార్టీ హయాంలో పెద్ద పెద్ద వాళ్లు ఆర్థికంగా లబ్ది పొందాలని, వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు మేలు జరుగుతోందని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: