ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఆంధ్రాలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా సమరానికి సిద్ధమవుతున్నాయి.. ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి సిద్ధమనే పేరుతో సమర శంకరాన్ని కూడా పూజించారు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నంలో భీమిలిలో ఈ సభలను మొదలుపెట్టారు. ఇప్పటి వరకు మూడు సభలను నిర్వహించిన వైసీపీ పార్టీ.. ఏలూరు జిల్లా దెందులూరు తో పాటు అనంతపూర్ జిల్లా రాప్తాడు లో సిద్ధం సభలను ఏర్పాటు చేశారు. దీంతో లక్షలాది మంది జనం మధ్య జరిగిన ఈ సిద్ధం సభలు చూసి ప్రతిపక్షాలు కూడా భయపడిపోయారు.


అయితే ఈ సభలన్నీ మించేలా ఈనెల 10వ తేదీన బాపట్ల జిల్లాలో అద్దంకి వద్ద నాలుగో సభ ను అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు వైసిపి పార్టీ నాయకులు.. ఈసారి ఎన్నికల బరిలో వైఎస్ఆర్సిపి పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల సైతం జతకట్టాయి.. టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని మరి ఎన్నికలలో నిలవబోతున్నారు. గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మొదటిసారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏపీలో ఎన్నికలు ఇండియన్ టీవీ పోల్ స్ట్రాటజీ గ్రూప్ తాజాగా తమ సంస్థ అంచనాలను సైతం బయటపెట్టాయి.

అయితే ఇప్పటివరకు ఎక్కువగా వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారంటూ చాలా సర్వేలు వెల్లడించాయి.. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడవసారి అధికారంలోకి వస్తుందని 377 స్థానాలతో కేంద్రంలో ఉంటుందంటూ తెలిపారు.. అలాగే ఏపీలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుందని మెజారిటీ లోక్సభ స్థానాలలో అత్యధికంగా కనిపించబోతోందని 19 చోట్ల విజయకేతం ఎగరేస్తుందంటూ తెలిపారు. అలాగే.. 125 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తెలియజేశారు. ఇక టిడిపి జనసేన తో కలిసి 50 సీట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు.. ఓటు పరంగా చూసుకుంటే సీఎం జగన్ కు 49.2% అని టిడిపి జనసేన ఇద్దరికీ కలిపి 46.3% అని తేల్చేసాయి అందుకు సంబంధించిన ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: