రాజకీయాలు చేయడం అనేది ఎలాంటి వారికైనా అంత ఆశమాషి విషయం కాదు.. ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికలను పద్ధతులను పాటిస్తూ ఉంటే ఈ రంగంలోనే రాణించగలరు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ కి ఎటువంటి చిన్న అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రసంగాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.. కొంతమంది నాయకులు చేసే అతి ప్రసంగాల వల్ల ప్రత్యర్థి పార్టీ నేతలకు సైతం కలిసొస్తూ ఉంటుంది.. గతంలో లోకేష్ రెడ్డి బుక్కు పేరుతో జగన్ కి కాస్త సహాయం చేయగా తాజాగా మరొక సభలో తన ప్రసంగంతో జగన్ గెలుపుకి పవన్ కళ్యాణ్ సహాయం చేశారని టాక్ అయితే బాగా వినిపిస్తున్నది..


ముఖ్యంగా రాజకీయాలలో వ్యూహాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. సభలు ఏర్పాటు చేయడం అక్కడ ప్రజలను ఆకట్టుకోవడంలో కూడా అంతే ముఖ్యము.. జనాలని ఆకట్టుకునే క్రమంలో ఎక్కడైనా లాజిక్ మిస్ అయితే అది ప్రత్యర్థుల  పార్టీలకు నేతలకు బాగా అనుకూలంగా మారుతుంది.. ముఖ్యంగా ప్రత్యర్థుల పైన దూషణ చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రతికూల ఫలితాలు సైతం ఏర్పడతాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఇదే జరిగిందని టాక్ అయితే బయట వినిపిస్తోంది..

తాడేపల్లిగూడెంలో టిడిపి జనసేన కూటమి జండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సొంత పార్టీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా అసహనాన్ని వ్యక్తం చేసిందట.. ఈ సభలో ఏవేవో మాట్లాడి కాస్త ఓవరాక్షన్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. కేవలం సీఎం జగన్ ని తిట్టడం కోసమే ఈ సభ ఏర్పాటు చేసుకున్నట్లు గా కనిపిస్తోంది.. ముఖ్యంగా పవర్ షేరింగ్ సీట్ల విషయాన్ని అసలు ప్రస్తావించలేదు తనను ఎవరు ఏ విధంగా ప్రశ్నించవద్దు అంటూ కూడా వ్యాఖ్యానించారు. పవన్ ప్రసంగం విన్న తర్వాత చాలామంది కాపు నేతలు జనసేన కార్యకర్తలు టిడిపికి ఓటు వేసే ప్రసక్తే లేదంటూ కూడా వెల్లడించారు.. కేవలం మంచి జరుగుతూనే ఓటు వేయండి అంటూ వైసీపీ నేత ఏపీ సీఎం తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పవన్ చంద్రబాబు ఎందుకు చెప్పలేదని విషయం ఇప్పుడు ప్రజలలో ప్రశ్నగా ప్రజలలో కలుపుతోంది. పదేళ్లు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మాట్లాడే మాటలు జగన్ కి ప్లస్ అవుతుందని లాజిక్ చాలానే మిస్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: