ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ మరొకసారి అధికారం రావాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలిచే వారికి అవకాశాలు ఇస్తూ ముందుకు వెళుతున్నారు. పలుచోట్ల కొత్తవారికి కూడా అవకాశాలు ఇస్తున్నారు వైసీపీ పార్టీ. ఇప్పటికే 9 జాబితాలను విడుదల చేయగా రాజమండ్రి పార్లమెంటు సీటు నుంచి టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్ గా పేరు పొందిన వివి వినాయక్ పేరు వినిపించగా ఆయన పోటీలో ఉండనని చెప్పడంతో ఇక్కడ హాస్యనటుడు ఆలీని ఈసారి ఎన్నికల బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ముఖ్యంగా కమెడియన్ ఆలీకి ముస్లింలలో ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటు నుంచి దింపాలని వైసిపి వర్గాలలో వార్తలు వినిపించాయి. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కూడా సీటు ఖరారు చేశారని త్వరలోనే దీనిపైన ప్రకటన వస్తుందని వార్తలు వినిపించాయి.. వాస్తవానికి ఆలీని గుంటూరు లేదా రాయలసీమ జిల్లాలోని మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు.అయితే చర్చల అనంతరం కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు నుంచి ఏదో ఒక స్థానంలో నిలవాలంటే జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

గత ఎన్నికలకు ముందు ఆలి వైసీపీలో చేరారు.. ఆ పార్టీ తరఫున నియోజవర్గాలలో కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత ఊరు రాజమండ్రి నుంచి టికెట్ ఆశించగా అది నెరవేరలేదు.అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పిన జగన్ చివరకు అలాంటి పదవులు రాకపోవడంతో 2021లో ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునుగా నియమించారు.. అయితే గతంలో సీటు  రాకపోయినందుకు ఆలి నిరుత్సాహంతో ఉండడంతో ఈసారి మరి పిలిచి లోక్ సభ పోటీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అందుకే నంద్యాల లేదా కర్నూలు జిల్లాలలో ఎక్కడో ఒకచోట నుంచి ఆలీని నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: