జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పైన ఇంకా ఎలాంటి క్లారిటీ రానప్పటికీ.. వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మాత్రం పవన్ సీటు విషయంలో చాలా ప్రణాళికంగానే ముందుకు వెళుతున్నారు..2019 లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా వైసిపి అభ్యర్థుల చేతుల చాలా దారుణంగా ఓడిపోయారు. అదేవిధంగా ఈసారి ఎన్నికలలో కూడా మరొకసారి వైసిపి పార్టీ చేతిలో ఓడిపోవడానికి సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.. అందులో భాగంగానే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసిన పవన్ కి ఆపోజిట్ గా ఒక దీటైన అభ్యర్థిని దించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.


ప్రస్తుతం రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ జనసేన అదే స్థానం నుంచి బరిలోకి దిగితే అక్కడ వైసిపి నేత ముద్రగడను బరిలో దింపే విధంగా జగన్ పలు రకాల వ్యూహాలను వ్యవహరిస్తున్నారట.. గత కొన్నేళ్లుగా ముద్రగడ జనసేనలో చేరుతారని వార్తలైతే వినిపించాయి.. ప్రస్తుతం జనసేన పార్టీకి దూరంగా ఉన్న ముద్రగడ ఈ నేపథ్యంలోను వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం..


ముద్రగడను వైసీపీలో చేర్చుకొని పవన్ కళ్యాణ్ పైన పోటీగా దింపే ఎలా వైసిపి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.. కాపు ఓటు బ్యాంకు అన్ని పార్టీలకు ప్రధానమని చెప్పవచ్చు.. ముఖ్యంగా అక్కడ  పవన్ కళ్యాణ్ సీటు ఎన్నుకొని అవకాశం ఉంది.. కనుక కాపులలో మంచి పట్టు ఉన్న ముద్రగడను బదిలోకి దింపితే కాపుల మద్దతు కచ్చితంగా లభిస్తుందని వైసీపీ క్యాడర్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. మరి ముద్రగడ పవన్ కు పోటీగా ఎన్నికలలో నిలిస్తే ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఎన్నికలు చాలా రసవత్తంగా ఉంటాయి.. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో మెగా ఫ్యామిలీకి మద్దతుగా ఉన్న ముద్రగడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలుస్తే ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: