ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ప్రజలకు సంక్షేమ పాలన అందించే విధంగా ముందుకు వెళుతున్నారు.. 57 నెలల పాలనలో సుమారుగా 98% హామీలను నెరవేర్చామంటూ తెలియజేస్తున్నారు. పైగా దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలను తీసుకువస్తున్నారు.. ముఖ్యంగా విద్య, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇతర ప్రాంతాలు కూడా ఆదర్శంగా నిలిచేలా ఏపీ నిలుస్తోంది.. విదేశాల నుంచి ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉన్నారు.. ప్రజలు కూడా జగన్ సంక్షేమ పాలనపైన చాలా సంతృప్తి గానే ఉన్నట్లు తెలుస్తోంది.


రాబోయే ఎన్నికలలో వైసిపి విజయం అంటూ అన్ని పార్టీల సర్వేలు కూడా నొక్కిమరి చెబుతూ ఉంటే ఓటమి భయంతో విపక్షాలు మాత్రం ప్రభుత్వం పైన బురద చల్లే పనిని పెట్టుకున్నారు..అసలు విషయం చెప్పకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఏదో విధంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. గడచిన కొద్ది రోజుల క్రితం.. వాలంటరీ వ్యవస్థతో డేటాని దొంగలిస్తున్నారని చెప్పడం.. ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తున్నారని చెప్పడం.. ఏపీ ని మరో శ్రీలంక చేస్తారని చెప్పడం.. నుంచి ఋషికొండ బిల్డింగ్ నిర్మాణంలో కూడా ఇలాగే ఎన్నో సత్య ప్రచారాలు కూడా చేశారు.. కేవలం ఒక్క నిర్ణయంతో వారందరికీ జగన్ షాక్ ఇచ్చారు..


ఇప్పుడు మళ్లీ ఆ విషయం నుంచి డైవర్ట్ చేయడానికి సచివాలయం తాకట్టు అనే పేరుతో మరొక విష ప్రయోగానికి దిగారు చంద్రబాబు నాయుడు జనసేన నేతలు..ఇంకా వీరి యొక్క మీడియా కూడా ఎంత అనుకూలంగా దిగజారిపోయిందంటే జగన్ ప్రభుత్వం 370 కోట్లకు సచివాలయాన్ని ఒక ప్రైవేటు బ్యాంకుకు రాసిచ్చిందంటూ పలు రకాల విషయాలను వైరల్ గా చేస్తున్నారు.. అయితే ఇది అవాస్తవమని పూర్తిగా తేల్చేసింది APPCRDA..



అందుకు సంబంధించి ఒక ప్రకటనను కూడా విడుదల చేసి వివక్షాలకు చెక్ పెట్టింది.. కొన్ని మీడియా సంస్థలు రాసినట్టుగా సచివాలయం తాకట్టులో ఉందనే వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ స్పష్టం చేసింది.. అంతేకాకుండా ఏపిసి ఆర్డిఏ భవనాలను తాకట్టు పెట్టి ఎలాంటి రుణాలను కూడా పొందలేదని తెలియజేశారు.. ఇక చంద్రబాబు కూడా ఇలాంటి విషయాలను వైరల్ గా చేస్తూ దిగజారిపోయి గెలవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: