దేశావ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అన్నీ రాష్ట్రాల్లో ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల వేళ దాదాపు రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండికాంగ్రెస్ కు నోటీసులు రావడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి కీలక సమయంలో తమ పార్టీను ఆర్థికంగా కుంగదీసేందుకు అధికార పార్టీ ఐనా భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించింది.ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో ఐటీ శాఖను తమపై ప్రయోగించి తమను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అయితే ఇప్పటికే దాదాపు రూ.135 కోట్లు తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకున్నారని అది సరిపోనట్లుగా మరల కొత్తగా 1,823.08 కోట్లు చెల్లించాలంటూ మాకు నిన్న నోటీసులు రావడం పై మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకస్తున్నామని దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినా కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేసారు. దాంట్లో భాగంగానే ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చింది. దేశావ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో శనివారం నాడు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసింది.ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా భావించిన  కాంగ్రెస్‌ ఈ పన్ను ఉగ్రవాదాన్ని నిరసిస్తూ అన్ని పీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలనీ అన్నది. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేతలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ. పార్టీ అభ్యర్థుల సమక్షంలో నియోజకవర్గాల్లోనూ నిరసనలు చేపట్టాలని సూచించారు.

అయితే అంతకుముందు ఇదే అంశంపై కేసీ వేణుగోపాల్‌ ఒక పోస్ట్ కూడా చేశారు. నోటీసులు, ఖాతాలను ఆపివేయడం వంటి  చర్యలతో కాంగ్రెస్‌ను బాగా ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నారు. భాజపాకు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమంటే ఇష్టం లేదని అందుకే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తుందని దీన్ని చూస్తూ ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటుందో అర్ధం కావట్లేదు అని అన్నారు. అయితే భాజపాపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే వాళ్లు కూడా రూ.4,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ఇన్కమ్ టాక్స్ అధికారుల్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. ఈ చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: