పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇప్పటికే అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ మరోసారి పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. తనకు సీఎంగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి ఇక పార్లమెంట్ ఎలక్షన్లలో మెజారిటీ స్థానాలలో గెలిచి ఇక బహుమతి ఇవ్వాలని అటు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నారు. ఇక మరోవైపు ఎప్పటిలాగానే బిజెపి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటుంది.


 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి భంగపడిన బిఆర్ఎస్ పార్టీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయిన సత్తా చాటాలని అనుకుంటుంది. అలా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో గెలవడం ద్వారా పార్టీలోని నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఇక కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఆపేలా చేయాలని గులాబీ దళపతి కేసీఆర్ ప్లాన్ వేశారట. ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారంలో మునిగితేలుతూ ఉన్నాయి. కార్యకర్తలు అందరితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు.



 గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బిజెపి నాయకుడు రఘునందన్ రావుకి ఇక ఇప్పుడు మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా కనీసం డిపాజిట్ కూడా రాదు అంటూ బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు విమర్శలు చేశారు. అయితే ఇటీవల ప్రెస్ మీట్ లో ఈ విమర్శలను తిప్పికొట్టారు రఘునందన్ రావు. మెదక్ లోక్సభ ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్ వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఎన్నికల్లో డిపాజిట్ రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. ఒకవేళ డిపాజిట్ వస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా.. ప్రస్తుతం హరీష్ రావు చెల్లని నాయకుడిగా మారిపోయాడు అంటూ విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: