ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎలాగైనా సరే తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.  అందులో భాగంగానే అధికార పార్టీ వైసీపీ పార్టీ ఒకవైపు వైనాట్ 175 అంటుంటే.. మరొకవైపు తెదేపా, జనసేన , భాజాపా కూటమిగా ఏర్పడి ఎలాగైనా సరే టిడిపిని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు.  ఇక అందులో భాగంగానే టిడిపి కూడా సీట్ల పంపకంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేటాయిస్తున్న స్థానాలు కొంతమందికి మింగుడు పడడం లేదు.. మరొకవైపు టీడీపీకి అత్యంత నమ్మకస్తులైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆలూరు నుంచి పోటీ చేస్తారన్న వార్త తెరపైకి వచ్చింది..

అయితే టిడిపిని ఎప్పటినుంచో నమ్ముకున్న ఈ కుటుంబానికి ఇప్పుడు చుక్కలు ఎదురయ్యాయని చెప్పాలి.. ముఖ్యంగా ఈ కుటుంబానికి టికెట్ కేటాయించకపోవడం ఇప్పుడు టిడిపిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..ఇక అసలు విషయంలోకెళితే తెదేపా - జనసేన - భాజాపా కూటమి ఆలూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ ను ఖరారు చేశారు.. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం శుక్రవారం ప్రకటించగా.. పొత్తులో భాగంగా ఆలూరు స్థానాన్ని తెలుగుదేశం పార్టీకే కేటాయించడం జరిగింది. మొదట మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో టిడిపి ఇన్చార్జిగా ఉన్న కోట్ల సుజాతమ్మకే టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ.. ఒక వర్గం నాయకులు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించి ఆందోళన కూడా చేశారు.. కానీ ఎట్టకేలకు ఆలూరు టికెట్ కోసం కోట్ల సుజాతమ్మ,  వైకుంఠం మల్లికార్జున,  వైకుంఠం జ్యోతి , వీరభద్ర గౌడ్ పోటీ పడగా.. చివరికి ఆ టికెట్ వీరభద్ర గౌడ్ ను వరించింది..ఈ నేపథ్యంలోనే టిడిపి శ్రేణులు,  గౌడ్ వర్గీయులు నియోజకవర్గం లో బాణసంచా పేల్చి , స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకుంటున్నారు..


కానీ ఈ విషయంపై కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం మొత్తం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా టిడిపికి నమ్మకస్తులుగా ఉన్న ఈ కుటుంబానికి ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడంపై కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం అలాగే ఆ తరపు ప్రజలు కూడా చంద్రబాబు నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇక టికెట్ వరించలేదు కాబట్టి వారు టిడిపికి సపోర్ట్ చేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా టిడిపి తీసుకున్న నిర్ణయానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు అలాగే ఆ తరపు వర్గం ప్రజలు ఆయనపై ఒకింత కోపంగానే ఉన్నారని చెప్పవచ్చు..

ఇకపోతే ఇండియన్ హెరాల్డ్ కు తెలిసిన సమాచారం ప్రకారం.. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి తన తండ్రి వారసత్వంతో 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.మళ్లీ ఆ తర్వాత 2019లో టిడిపి పార్టీలోకి చేరారు అక్కడ ఓడిపోవడం జరిగింది సూర్య ప్రకాశ్ రెడ్డి. ఇక తర్వాత టిడిపిలోకి చేరిన వీరికి ఇప్పుడు టికెట్ వరించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది..మొత్తానికైతే ఇండియా వరల్డ్ విశ్లేషణ ప్రకారం..టిడిపి పార్టీపై నమ్మకాన్ని పెట్టుకున్న కోట్ల కుటుంబాన్ని చంద్రబాబు బాబు వమ్ము చేశారని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: