తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి BRS పార్టీకి అన్ని రకాలుగా ఎదురు దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే.  BRS పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పోటీ చేసేందుకు అభ్యర్థులెవరూ దొరక లేదు. వారిలో కాస్త బలవంతులు అనుకునే వారిని ఎంపిక చేసుకుంటే.. ఊగిపోతున్నారు. మొత్తం 17 స్థానాల్లో హైదరాబాద్‌కు పోటీ చేసినా, చేయక పోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మిగిలిన పదహారు స్థానాల్లో ముగ్గురు సిట్టింగ్‌లకు అత్యంత కష్టతరమైన స్థానం లభించింది. కుటుంబసభ్యుడి లాంటి బోయినపల్లి వినోద్ కుమార్ కు కరీంనగర్ సీటు ఇచ్చారు. మిగతా అభ్యర్థులందరూ పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలపై కూడా పుకార్లు రావడం తో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతోంది. జంపింగ్ లిస్టులో నామా నాగేశ్వరరావు పేరు చాలా కాలంగా చక్కర్లు కొడుతోంది. తాజాగా మహబూబాబాద్ అభ్యర్థి కవిత పేరు కూడా వార్తల్లోకి ఎక్కింది. ఆమె వెంటనే ఖండించింది.

ప్రస్తుతం  BRS పార్టీ పరిస్థితి చూస్తుంటే.. ఎవరూ నమ్మలేని రాజకీయ పార్టీగా కనిపిస్తోంది. మెజారిటీ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు ఇప్పటి వరకు తమ ప్రచారాన్ని ప్రారంభించలేదు. గందరగోళం నెలకొనడం తో పార్టీ క్యాడర్ కదలడం లేదు. కొందరు అభ్యర్థులు కాంగ్రెస్‌తో మోసపూరిత ఒప్పందం కుదుర్చుకుని నామినేషన్లు ఉపసంహరించుకుంటారని, లేకుంటే లంచం ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం వరంగల్ అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది.

నామినేషన్లు వేయకపోయినా.. నామినేషన్ల అనంతరం పక్కకు తప్పుకున్నా ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్న నియోజకవర్గాలు లేవని సమాచారం. చివరకు మెదక్ కూడా అయోమయంలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఆధిక్యం కనబర్చిన చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ వంటి చోట్ల ఎలాంటి క్లిష్ట సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించడం కష్టమని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr