జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు వైసీపీపై ప్రత్యక్షంగా జగన్ గురించి పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది కిరాయి మూకలు ఏం చేస్తారంటే సన్నటి బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని నా విషయంలో కూడా ఇలా జరుగుతోందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు అస్సలు నమ్మేలా లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
బ్లేడ్ గాయాలు చూపించొచ్చుగా పవన్ అంటూ సామాన్యులు సైతం ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడం రైటేనా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చుట్టూ 24 గంటలు సెక్యూరిటీ ఉంటుంది. పవన్ ఎక్కడికి వెళ్లినా ఆయన అభిమానులు తండోపతండాలుగా వస్తారు. పవన్ కు కానీ, ఆయన సెక్యూరిటీకి కానీ ఎవరైనా కావాలని గాయం చేస్తే పవన్ ఫ్యాన్స్ ఆ వ్యక్తులను పట్టుకుని ఎవరు చేయించారో ఎందుకు చేయించారో తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.
 
పవన్ కళ్యాణ్ మాటలు విన్నవాళ్లలో చాలామంది సింపతీ కోసం పవన్ ఈ తరహా కామెంట్లు చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జనసేన కేవలం 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ తక్కువ స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని పవన్ అభిమానులలో ఆవేదన ఉంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కనీసం ఏడాదైనా సీఎంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 
ఫ్యాన్స్ ఆకాంక్షలను నెరవేర్చేలా పవన్ నుంచి స్పష్టమైన హామీ రావాలని సామాన్యులు భావిస్తున్నారు. జనసేన పార్టీ గత పదేళ్లలో ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. ఈ ఎన్నికలు జనసేన భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి. కనీసం 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తే మాత్రం పవన్ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ, బీజేపీలతో జనసేన పొత్తు పెట్టుకోగా ఈ పొత్తు జనసేనకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: