టీడీపీ అమరావతి రాజధానిగా కొనసాగాలని భావిస్తుండగా వైసీపీ విశాఖను రాజధానిగా కొనసాగించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని విషయంలో రెండు పార్టీల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రజల్లో కూడా రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలే రాజధానిని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ ఎంచుకున్న ప్రాంతమే రాజధానిగా కొనసాగే ఛాన్స్ ఉంది.
 
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి ఎడ్జ్ ఉంది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించే ఛాన్స్ లేదు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులపై ఓటర్ల ఆలోచన ఎలా ఉందో ఇప్పటికే ఒక అంచనాకు రాలేము. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో కనీసం 90 స్థానాల్లో విజయం సాధిస్తే మాత్రమే జనసేన సీట్లతో సంబంధం లేకుండా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
 
ఎన్నికలు పూర్తయ్యే వరకు వెలువడే సర్వే ఫలితాలను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికలు పూర్తై ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వస్తే మాత్రమే ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందో ఒక అంచనాకు రావచ్చు. వైసీపీ, టీడీపీల భవిష్యత్తును ఈ ఎన్నిక డిసైడ్ చేయనుందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనే చర్చ ప్రజల మధ్య జోరుగా జరుగుతోంది.
 
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇరు పార్టీలు సాయశక్తులా కృషి చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ ప్రధాన నేతలు ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్లకు ప్రయోజనం చేకూరేలా హామీలు ఇస్తున్నారు. ఏపీలో హంగ్ వచ్చే పరిస్థితి లేకపోవడం రెండు పార్టీలకు ఒకింత ఉపశమనం అని చెప్పవచ్చు. ఏపీ రాజధాని ఫిక్స్ అయితే రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరిగే ఛాన్స్ ఉంటుంది. రాజధాని సమస్య వల్ల రాష్ట్రానికి వచ్చే కంపెనీలు సైతం వెనుకడుగు వేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: