2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఎన్నో సర్వే సంస్థలు అంచనా వేసినా 150కు పైగా స్థానాలలో విజయం సాధిస్తుందని ఏ సర్వే కూడా అంచనా వేయలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి టీడీపీ చేసిన తప్పులే కారణమని విశ్లేషకులు భావించారు. అనుభవం ఉన్న నేత అని చంద్రబాబుకు ఛాన్స్ ఇస్తే ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
 
అయితే ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడంలో 82 నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయి. ఏపీలో 82 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు ఏకంగా 20 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం టీడీపీ దృష్టి కూడా ఈ నియోజకవర్గాలపైనే ఉందని సమాచారం అందుతోంది. వైసీపీకి కంచుకోటల్లాంటి ఈ నియోజకవర్గాల్లో టీడీపీ సగానికి పైగా సీట్లలో విజయం సాధిస్తే సునాయాసంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
 
అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ స్థానాలలో టీడీపీ గెలుపు అసాధ్యమని ఈ ఎన్నికల్లో మెజారిటీ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరోవైపు జగన్ గ్రాఫ్ పెరిగిందని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఈ 82 సీట్లకు సంబంధించి ఎన్నో లెక్కలు వేసి టీడీపీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించినట్టు సమాచారం అందుతోంది. 5 వేల లోపు ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచిన స్థానాలు 12 కాగా ఈ స్థానాలలో మాత్రం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కచ్చితంగా అనుకూల ఫలితాలు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు.
 
20 వేలకు పైగా మెజార్టీ సాధించిన 82 నియోజకవర్గాలలోని మెజారిటీ నియోజకవర్గాల్లో జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు. అభ్యర్థుల విషయంలో సైతం ఇకపై ఎలాంటి మార్పులు ఉండబోవని జగన్ తేల్చి చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే విషయంలో టీడీపీ ఒకింత వెనుకబడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: