ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడానికి ఎంతో కష్టపడుతున్నారు. అయితే షర్మిల, సునీత వల్ల జగన్ కు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సొంత చెల్లెళ్లే జగన్ ను నమ్మకపోతే ప్రజలు ఎలా నమ్మాలంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ బాణం షర్మిల వైసీపీనే పొడుస్తోందంటూ పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
 
2019 ఎన్నికలకు ముందు బైబై బాబు అంటూ ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. జనసేన నేత, ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ షర్మిల ప్రభావం 12 శాతం ఓట్లపై ఉంటుందని వైసీపీ అనుకూల ఓట్లు షర్మిల వల్ల కచ్చితంగా చీలుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019లో తాడేపల్లిలో వైసీపీ తరపున టపాసులు కాల్చానని ఈసారి వైసీపీ ఓడిపోతే అక్కడ టపాసులు కాల్చుతానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
 
జగన్ కు ప్రజలతో పాటు ప్రకృతి సైతం జవాబు ఇస్తుందంటూ పృథ్వీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయని పృథ్వీరాజ్ వెల్లడించారు. షర్మిల 12 శాతం ఓటు బ్యాంక్ పై ప్రభావం చూపితే మాత్రం వైసీపీకి 50 కంటే తక్కువ సీట్లు వస్తాయని చెప్పవచ్చు. ఏపీలో కాంగ్రెస్ నుంచి సైతం స్థానికంగా మంచి పేరు ఉన్న నేతలు పోటీ చేస్తున్నారు.
 
షర్మిల జగన్ ఓటమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తుండటం గురించి ఏపీ ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డిపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తుండగా అవినాష్ ఆ కామెంట్ల గురించి క్లారిటీ ఇచ్చారు. మసి పూసి బూడిద జల్లి తుడుచుకోమంటారని తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారని నాపై చేస్తున్న కామెంట్లను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ మాత్రం షర్మిల విమర్శల గురించి ఎక్కువగా రియాక్ట్ కావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: