పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికీ ఎన్నో ఏళ్లు కావస్తున్నా.. తన పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా రాజకీయాల పరంగా ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ప్రస్తుతం జనసేనకు 6 శాతం ఓట్ బ్యాంక్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈసారి ఎన్నికలలో ఇది కాస్త పెరిగేలా కనిపిస్తోందంటూ రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి తో పొత్తుతో భాగంగా కూటమి ఏర్పాటు చేయగా.. పవన్ రాజకీయ ఆలోచనలో మార్పు రావడం వల్ల ఈసారి ఫలితాలు జనసేన కార్యకర్తలను కూడా ఆనందపరిచేలా ఉన్నాయని తెలుస్తోంది.


పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కావడం చేత చిత్రసీమ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు కావాల్సినంత సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చాలామంది హీరోలు పవన్ కళ్యాణ్ అభిమానులే..  వారంతా కూడా జనసేన పార్టీకి సైలెంట్ గా సపోర్టు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కొంతమంది హీరోలు జనసేన కోసం భారీ మొత్తంలో విరాళాలు కూడా పార్టీకి పంపిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల చిరంజీవి కూడా ఏకంగా ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ప్రకటించారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ యాడ్స్ తీయడంలో కూడా కొంతమంది దర్శకనిర్మాతలు అండగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  సాధారణంగా టిడిపికి గతంలో ఇలాంటి సపోర్టు ఉన్నది. సీనియర్ దర్శకులు,  నిర్మాతలలో చాలామంది టీడీపీ అభిమానులు ఉండడం చేత ప్రతి ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీకి తరపున యాడ్స్ రూపొందించడంలో చాలా సహాయపడేవారట..ఇప్పుడు జనసేన,  టిడిపి పొత్తులో భాగంగా చేతులు కలపడంతో జనసేన పార్టీకి సైతం చాలామంది సహాయంగా నిలుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో ఈసారి ఎన్నికలలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించడం ఖాయమంటూ జనసేన కార్యకర్తలు ధీమాని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: