ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వాడి వేడిగా జరుగుతున్న నేపథ్యంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అయితే కట్టాయి. కానీ ఈ మూడు కూడా ఒకటిగా లేవు.. ఒక్క మాటపై అసలు నడవడం లేదు. పట్టుమని పది సీట్లు గెలుస్తామన్న నమ్మకం అసలు వాటికే లేదని చెప్పాలి.. ఒంటరిగా పోటీ చేసే బలం ఒక్క పార్టీకి కూడా లేదు... అందుకే మూడు జతకట్టాయి. కానీ జత కట్టిన మేరకు ఏకతాటిపై నడవాలి.కానీ ఈ మూడు పార్టీలు అందుకు భిన్నంగా ఉన్నాయి. నానా ప్రయాసలు పడి సీట్ల సర్దుబాటు చేసుకున్న అతి కష్టం మీద 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ మూడు పార్టీలలో కూడా ఇప్పుడు గందరగోళం అలాగే కొనసాగుతూనే ఉంది.. అభ్యర్థులను ప్రకటించడంతో కొంతమంది సీనియర్ నేతలు భంగపాటుకు గురి అవుతున్నారు. ఫలితంగా టీడీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఫర్నిచర్, ఫ్లెక్సీలతో సహా విలువైన వస్తువులను దగ్ధం చేస్తుండగా మరికొంతమంది టీడీపీని వీడి వైసీపీలోకి చేరుతున్నారు..

ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలని మళ్లీ జాబితా మార్చారు. పలు స్థానాలలో అభ్యర్థులను మార్చి వేరొకరికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికీ ఇంకా సుమారు 50 వర్గాలలో తిరుగుబాట్లు అసంతృప్తుల ఆందోళనలతో ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. సీట్లు ఖరారు అయినా సరే అది తుది నిర్ణయం కాదు అని.. టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా చెప్పారు. దీంతో టికెట్టు పొందిన అభ్యర్థులు కూడా ప్రచారం మొదలు పెట్టాలా లేదా అన్న సందేహంలో ఉన్నారు మరొకవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా వీడని గందరగోళాలు కూటమికి తీవ్ర నష్టాన్ని మిగిల్చేలా కనిపిస్తున్నాయి.

ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై వస్తున్న రకరకాల ఊహాగానాలు కూటమిలో ఇప్పుడు అయోమయాన్ని సృష్టించాయి. ఈ సీటును బిజెపికి కేటాయించి శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించారు.. కానీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన రఘురామకృష్ణరాజు ఇప్పటికీ ఆ సీటు తనదే అని అంటున్నారు.. మరొకవైపు బిజెపి శ్రీనివాస్ వర్మను మార్చి రఘురామకు ఆ సీటు ఇస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. మరొకవైపు రఘురామకృష్ణరాజు కూడా టిడిపిలో చేరడంతో అది జరిగే పని కాదని తేలిపోయింది.. ఇకపోతే బిజెపి ఎన్నికల ఇన్చార్జి సిద్ధార్థ నాథ్ సింగ్ నరసాపురంలో తమ అభ్యర్థిని మార్చే అవకాశం లేదని సోమవారం తేల్చి చెప్పారు. మొత్తానికైతే కూటమిలో అసంతృప్తి ఛాయలు ఇంకా భగ్గుమంటున్నాయి. మరి ఈ గందరగోళం నుంచి కూటమి ఎప్పుడు బయట పడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: