రాజకీయం అన్నదమ్ముల మధ్య చిచ్చును పెడుతుంది. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములు కూడా రాజకీయంలోకి దిగిన తర్వాత భద్ర శత్రువులుగా మారిన వారు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. వీరిలో కేశినేని బ్రదర్స్ కూడా ఒకరు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో కేశినేని చిన్ని మరియు నాని ఎంపీలుగా పోటీ చేయబోతున్నారు.

కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా ఎంపీగా బరిలోకి దిగుతూ ఉండగా... కేశినేని నాని వైసీపీ పార్టీ నుండి ఎంపీగా బరిలోకి దిగబోతున్నాడు. దానితో వీరిద్దరూ ఒకరిపై ఒకరు వాదప్రతివాదనలు చేసుకుంటున్నారు. తాజాగా కేసినేని చిన్ని ... ప్రజలను మోసం చేయడంలో నాని ఘనపాటి. తన దగ్గర పని చేసే పని వారికి కూడా జీతాలు ఎగ్గొట్టిన వ్యక్తి. అలా ఎగ్గొట్టడంతో ఆయనపై లేబర్ కేసులు కూడా అయ్యాయి.

ఇప్పటికీ ఆ కేసులు కోర్టులోనే ఉన్నాయి. నువ్వు ఎన్నో దందాలు చేసి డబ్బు సంపాదించుకున్నావు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్నారు. 30 వేల ఎకరాలు ఇచ్చి బాధపడుతున్న రైతులకు లేని బాధ నీకెందుకు అని చిన్ని, నాని పై ఫైర్ అయ్యారు. ఇక దానితో తాజాగా నాని కూడా చిన్ని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

నేను ఎప్పుడూ డబ్బు సంపాదించుకోలేదు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం... వారి బాగుకోసం నేను నా ఆస్తులను అమ్ముకున్నాను. నేను సంపాదించుకున్న ఆస్తులను నేను అమ్ముకుంటే తప్పేంటి..? కేశినేని నాని పేరు వాడుకొని కేశినేని డెవలపర్స్ అనే పేరుతో వందల మందినీ మోసం చేశాడు. ఫేక్ ఎంపీ స్టిక్కర్స్ ను వేసుకొని హైదరాబాదులో రియల్ దందాను నడిపాడు.

కూటమి ఎంపీ అభ్యర్థి పై తెలంగాణ టేర భారీ జరిమానా విధించి కూటమి అభ్యర్థికి సంబంధించిన కేసినేని డెవలపర్స్ సంస్థ పై రియల్ ఎస్టేట్ అధారిటీ ఆఫ్ తెలంగాణ... పేదవాన్ని మోసం చేసి అడ్వాన్సులు తీసుకొని అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మిస్తున్నారు. అని సంబంధిత సంస్థపై భారీ జరిమానా విధించిన విషయం టీవీలలో కూడా వచ్చింది. ఇంత చేసిన నువ్వు నాపై విమర్శలు చేస్తావా..? అంటూ కేసునేని చిన్ని పై నాని ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: