జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ అంటే ఏ రేంజ్ లో జోష్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన స్పీచ్ ను స్టార్ట్ చేశారు అంటే పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. జుట్టును పైకి ఎగరవేస్తూ ప్రత్యర్ధులను ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. దానితో ఈయన ఎక్కడైనా సమావేశంలో పాల్గొన్నాడు అంటే ఆ తర్వాత రెండు, మూడు రోజుల పాటు అక్కడ పవన్ సంభాషణలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

అలా ఎన్నికలకు ముందు వరకు అంత జోష్ తో ... అంత కోపంతో, ఉక్రోషంతో ఊగిపోయిన పవన్ ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు. పవన్, చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయన్ని జైలుకు వెళ్లి కలిశారు. ఆ తర్వాత పొత్తు పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ పొత్తు జరిగినప్పటి నుండి పవన్ కాస్త సైలెంట్ అయిపోయారు. ఇక బీజేపీ కూడా ఈ పొత్తులో కలవడంతో ఈయన మరింత సైలెంట్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. ఇక నిన్న ఈయన అవనిగడ్డలో ఓ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ మీటింగ్ తో పవన్ ఏమైనా మారిపోయాడా..? లేదా అనే దానిపై క్లారిటీ వస్తుంది అని జనాలు కూడా అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగానే నిన్నటి మీటింగ్ అంతా చెప్పగా సాగిపోయింది. మునపటి పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించలేదు. తాను పొత్తులో భాగంగా ఎందుకు పోటీ చేస్తున్నాను..? అని విషయంపై మాత్రమే స్పీచ్ ఎక్కువగా సాగింది.

ఇక ఈ స్పీచ్ లో భాగంగా పవన్... మోడీ గారికి చెప్పి జగన్ ను కాస్త కట్టడి చేయమని చెప్పవచ్చు. కానీ నేను అలా అడగను. ఎందుకంటే అది మా ఇద్దరి మధ్య ప్రాంతీయంగా ఉన్న వ్యవహారం. దానిలోకి ఎవరిని లాగే ఉద్దేశం నాకు లేదు. ఇక జగన్ పాలన వల్ల ఆంధ్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పోవాలి అంటే మా కూటమే పవర్ లోకి రావాలి అనే విషయాన్ని మాత్రమే పవన్ చెప్పుకుంటూ వచ్చాడు. నిన్నటి స్పీచ్ తో పవన్ లోని జోష్ ,  గాంభీర్యం , తిరుగుబాటు చాలా వరకు తగ్గింది అని క్లియర్ గా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: