- ఉగాది జాతకంలో రేవంత్ కు అన్ని మంచి శకునాలే

- ఐదేళ్ల వరకు తిరుగు లేదట

- పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ దే హవా


    (తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )

నేటి నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. దీంతో ఇక తమ రాశులను బట్టి ఈ కొత్త సంవత్సరంలో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే విషయంపై అందరూ జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ ఏడాది ప్రముఖుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకునేందుకు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల భవిష్యత్తు ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు.



 అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలను.. కక్షపూరిత చర్యలను ఎదుర్కొంటూ వచ్చిన రేవంత్ ఏకంగా ప్రజలందరిలో కాంగ్రెస్ పార్టీ పై నమ్మకాన్ని కలిగించి.. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టారు. అయితే ఈ ఏడాది ఆయనకి ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే.. 1969 నవంబర్ 8వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జన్మించారు. ఆయనది తులారాశి, చిత్త నక్షత్రం. అయితే ఇక నేటి నుంచి ప్రారంభం కాబోయే క్రోధి నామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉందంటే.. ఈ ఏడాది రేవంత్ రెడ్డికి మహర్దశ పట్టనుందని జ్యోతిష్య పండితులు అభిప్రాయపడుతున్నారు.



 ఎటువంటి అంతరాయం లేకుండా ఐదేళ్లపాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారని చెబుతున్నారు జ్యోతిష్యులు. అయితే కేవలం తెలంగాణలో మాత్రమే కాదు భవిష్యత్తులో ఆయన ఢిల్లీలో కూడా చక్రం తిప్పే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఆయన జాతకాన్ని పట్టి చూస్తే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారం చేపట్టిన రేవంత్.  ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటి మరోసారి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వబోతున్నారని అందరూ అనుకుంటున్నారట. ఇప్పటికే వందరోజుల పాలన ముగించుకొని ఇక కొన్ని పథకాలను  అమలు చేసి ప్రశంసలు అందుకుంటున్న రేవంత్.. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను అమలు చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాడట సీఎం రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: