తెలంగాణ రాజకీయాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టింది హస్తం పార్టీ. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు రేవంత్. అయితే ఇక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అవకాశం లేకుండా ఆ పార్టీ కీలక నేతలందరినీ కూడా హస్తం గూటికి చేర్చుకుంటూ కేసీఆర్ కి షాక్ కి ఇస్తున్నారు.


 ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం  అటు అధికార కాంగ్రెస్ పార్టీకి అసలైన పోటీదారు బిజెపి పార్టీ మాత్రమే అన్నట్లుగా ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఉంది. అయితే  బిజెపి పార్టీలోని పెద్ద తలకాయపైనే రేవంత్ టార్గెట్ పెట్టుకున్నాడట . ప్రస్తుతం బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో మరోసారి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నాడట. ఇలాంటి సమయంలో రేవంత్ కిషన్ రెడ్డిని సికింద్రాబాద్లో ఓడించి ఇక బిజెపిలోని పెద్ద తలకాయను కొడితే ఆ పార్టీని సైకలాజికల్ గా దెబ్బ కొట్టొచ్చు అని ప్లాన్ వేస్తున్నారట.


 ఈ క్రమంలోనే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డిని ఓడించేందుకు స్పెషల్ ఫోకస్ తో పావులు కదుపుతూ ఉన్నాడట. ఇప్పటికే సికింద్రాబాద్లో ఉన్న పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చిన రేవంత్.. ఇక అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై  ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది  సెట్టింగ్ ఎంపీగా ఉండడమే కాదు.. ఏకంగా కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసి కూడా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాడట రేవంత్. కిషన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతను ఇక తమకు అనుకూలంగా మార్చుకోవాలని.. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు జారీ చేశారట. ఇక అక్కడి నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని కంకణం కట్టుకున్నారట. మరి రేవంత్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: