కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా తెలుగుదేశం నుంచి తన పార్టీకి వచ్చిన నేతలపై ఆసక్తి చూపించి వారికే సీట్లు కేటాయించాడు పవన్. దీంతో తాజాగా జనసేనకు రాజీనామా చేశాడు ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్.. అది కూడా పవన్ పై ఘోరంగా మండిపడి  తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో మరో అగ్ర నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తారు.విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించిన దగ్గర నుంచి తీవ్ర అసంతృప్తిగా ఉన్న పోతిన.. పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కూడా కష్టానికి తగ్గ ఫలితం దక్కకపోవడంతో జనసేనకు గుడ్ బై చెప్పారు. దీంతో పోతిన ఏ పార్టీలో చేరబోతున్నారా అని బెజవాడలో జోరుగా చర్చ జరిగింది. అయితే కేవలం 24 గంటల్లోనే ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు పోతిన మహేష్. వైసీపీలో చేరబోతున్నట్టు పోతిన మహేష్ చెప్పకనే చెప్పేశారు. సింహంలా సింగిల్‌గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందన్నారు పోతిన మహేష్.


జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనని పవన్ పై మండిపడ్డారు. మాట ఇస్తే మడమ తిప్పని అసలైన నాయకుడితో కలిసి పనిచేస్తానంటున్నారు పోతిన మహేష్.పవన్‌కల్యాణ్‌పై పోతిన మహేష్ ఆరోపణలు చేయడం పట్ల కూటమి నేతలు మహేష్ పై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అన్యాయం జరిగిందనిపిస్తే ఖచ్చితంగా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు.. అలా అని తిడుతూ లేని పోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని కృష్ణా జిల్లా జనసేన నేతలు కూడా తప్పుబట్టారు. ఎలా పడితే అంత మాట్లాడితే జనసేన కార్యకర్తలు ఖచ్చితంగా మీకు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై పోతిన మహేష్ పలు ఆరోపణలు కూడా చేశారు. వాటికి ఆధారాలు కూడా ఉన్నాయనీ.. త్వరలోనే ఖచ్చితంగా వాటిని బయటపెడతాననీ అన్నారాయన. అయితే పోతిన మహేష్ కు అదే రేంజ్‌లో జనసేన కూటమి నేతలు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. తాము కూడా పోతిన చరిత్రను బయటపెడతామంటూ వారు హెచ్చరిస్తున్నారు. మరి చివరకి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: