ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. అయితే ఇక అన్ని పార్టీల నేతలు అందరూ కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొన్ని చిన్న పార్టీలు కూడా ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక కీలకమైన పార్లమెంటు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా రెడీ అవుతున్నాయి అని చెప్పాలి..



 అయితే ఇక ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీపై ఒక ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీకి అటు దేశ నలుమూలల్లో కూడా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడీ ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్లుగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుకే మోడీ పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇక బరిలో దిగడానికి మిగతా పార్టీల నేతలు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఒకవేళ పోటీ చేసిన ఓటమి ఖాయం అనుకుని భావించే బరిలోకి దిగడం చూస్తూ ఉంటాం.



 కానీ ఇక్కడ మాత్రం ఒక చిన్న పార్టీ నుంచి ఏకంగా మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గ నుంచి ఒక ట్రాన్స్ జెండర్ ఏకంగా ప్రధానిపై పోటీ చేస్తున్నారు. అఖిల భారత హిందూ మహాసభ కు చెందిన హేమాంగి సఖి మాత ప్రధాన మోడీతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ పడబోతున్నారు. అయితే బరోడా లో జన్మించిన ఆమె ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ కావడం గమనార్హం. 2019లో ఆచార్య మహామండలేశ్వర్ గా ఆమె పట్టాభిషిక్తులు అయ్యారు. అయితే ఇలా మోడీపై ఒక ట్రాన్స్ జెండర్ బరిలోకి దిగడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: