- 30 ఏళ్ల‌లో ఫ‌స్ట్ టైం పుంగ‌నూరులో పెద్దిరెడ్డికి ముచ్చెమ‌ట‌లు
- స్టేట్ వైడ్ బీసీల‌కు న్యూ ఐకాన్‌గా రామ‌చంద్ర యాద‌వ్‌
- 4 ఏళ్ల‌లో 50 కు పైగా కేసుల‌తో వేధించినా వెన్ను చూప‌ని వైనం..?


( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఆయ‌న పేరు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి. జిల్లాలోనేకాదు.. రాష్ట్రంలోనూ ఈయ‌న‌కు తిరుగులేదు. ఇలాంటి రామచంద్రారెడ్డికి చెక్ పెడుతూ.. పెద్దిరెడ్డి కంచుకోట పుంగ‌నూరులో వినిపిస్తున్న మ‌రో పేరు.. బోడే రామ‌చంద్ర యాద‌వ్‌. భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ త‌ర‌ఫున ఆయ‌న పోటీ చేస్తున్నారు. ఇది ఆయ‌న సొంత పార్టీ. దీంతో ఇక్క‌డ పెద్దిరెడ్డి కోట‌లో రామ‌చంద్ర రాజ‌కీయం ఓ రేంజ్‌లో ముందుకు సాగుతోన్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

 
రామచంద్ర యాదవ్ 2019 ముందు వరకు వ్యాపారవేత్తగా అంద‌రికీ తెలిసిన నాయ‌కుడే. అప్ప‌ట్లో ఆయ‌న జ‌న‌సేన త‌ర్థం పుచ్చుకుని ఆ పార్టీ త‌ర‌ఫున పుంగ‌నూరులో పోటీ చేశారు. అయితే.. ఆ  ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై ఆయ‌న విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. అయితే.. త‌న‌కు ప్ర‌చారం చేసేందుకు ప‌వ‌న్ స‌మ‌యం కేటాయించ‌లేద‌ని.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని బోడే ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు.  


అంతేకాదు.. పుంగనూరులో నిర్మించుకున్న ఇంటి గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మాన్ని ఒక పెద్ద పెళ్లిలా నిర్వ‌హించారు. ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. ఈ ఒక్క ఘటనతో రామచంద్ర యాదవ్ పేరు మార్మోగింది. యోగా గురువు రాందేవ్ బాబా సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి సొంత పార్టీ భార‌త యువ‌జ‌న చైత‌న్య పార్టీ త‌ర‌పున బోడే పోటీ చేస్తున్నారు.  పెద్దిరెడ్డి అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారని అభివృద్ధి అనేది లేదంటూ ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.


పెద్దిరెడ్డిపై బోడే ఈ రేంజ్‌లో పోరాటం చేస్తోన్న క్ర‌మంలో ఆయ‌న‌పై ఏకంగా ఈ నాలుగేళ్ల‌లో 50కు పైగా కేసులు బ‌నాయించి నానా ఇబ్బందులు పెట్టారు. ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా రామ‌చంద్ర యాద‌వ్ ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు స‌రిక‌దా.. మ‌రింత‌గా రాటుదేలారు. ఇప్పుడు స్టేట్ వైడ్‌గా బీసీల‌కు యూత్ ఐకాన్ లీడ‌ర్‌గా రామ‌చంద్ర యాద‌వ్ మారిపోయారు.


నియోజకవర్గంలో పెద్దిరెడ్డి టార్గెట్‌గా ఉద్యోగ మేళా, ప్రాజెక్టుల పరిశీలన, పర్యటనలు చేసేందుకు యత్నించారు. పుంగనూరులో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయని వాటికి చెక్‌ పెడితే పుంగనూరులో విజయం పెద్ద విషయం కాదని భావిస్తున్నారు. అందుకే ఎన్నికల్లో అక్రమాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల టైంలో జరిగిన విషయాలను వారికి రిపోర్ట్ చేశారు. దీంతో నియోజకవర్గంలో 182 సమస్యాత్మక ప్రాంతాలను కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తించింది.


ఈ కేంద్రాల్లో పోలింగ్ జ‌రిగిన స‌మ‌యంలో ప్ర‌తి విష‌యాన్ని వీడియో తీస్తారు. అంటే ఎలాంటి అక్ర‌మాలు జ‌రిగేందుకు ఆస్కారం లేకుండా పోతుంద‌న్న మాట‌. అదేవిధంఆ సీసీ టీవీ రికార్డింగ్ చేస్తారు.  అంటే.. ఇది ఒక‌ర‌కంగా పెద్దిరెడ్డికి కాక‌పుట్టించే వ్య‌వ‌హార‌మేన‌ని అంటున్నారు. ఒక్క‌టి మాత్రం నిజం.. పెద్దిరెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ఆయ‌న‌కు ఈ స్థాయిలో ద‌డ‌పుట్టించే ద‌మ్మున్న లీడ‌ర్ ఎవ్వ‌రూ ఎదురుకాలేదు. ఇప్పుడు రామ‌చంద్ర యాద‌వ్ దెబ్బ‌కు పెద్దిరెడ్డికి ఆయాసం, సాలి కూడా వ‌స్తున్నాయ‌న్న సెటైర్లే వినిపిస్తున్నాయి.  మ‌రి ఈ సారి పెద్దిరెడ్డి ఓట‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న బోడే ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: