ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు చాలా దగ్గరికి వచ్చిన విషయం మనకు తెలిసిందే. దానితో సీట్ దక్కిన నాయకులు ప్రచారాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటే సీట్ దక్కని నాయకులు ఇప్పటికి అధిష్టానం పై గుర్రుగా ఉన్నారు. అలాంటి వారిని బుజ్జగించే పనిలో ప్రస్తుతం అధిష్టానం కృషి చేస్తుంది. ఈ సంవత్సరం జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న "వై సీ పీ" ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తూ ఉండగా ... తెలుగు దేశం , జనసేన ,  బీ జే పీ మూడు పార్టీలు కలిపి ఓ కూటమిలా పోటీ చేస్తున్నాయి.

ఇకపోతే ప్రతి సారి లాగానే ఈ సారి కూడా కృష్ణ జిల్లా పై పార్టీల అధిష్టానాలు ప్రత్యేక ఫోకస్ ను పెట్టాయి. అందులో భాగంగా ఇప్పటికే ఇరు వర్గాలు కృష్ణ జిల్లాకు సంబంధించిన దాదాపు అన్ని ఏరియాలో క్యాండిడేట్ లను ఫైనల్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే పెడన నియోజక వర్గనికి కూడా అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దగా పోటీ కనిపించడం లేదు. ఇక ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి "వై సీ పీ" ఇక్కడి నుండి ఉప్పల రాము కి టికెట్ను ఇవ్వగా ... ఇక ఈ ఏరియా సీటు పొత్తులో భాగంగా తెలుగు దేశం కు వచ్చింది.

అందులో భాగంగా తెలుగు దేశం వారు కాగిత కృష్ణ ప్రసాద్ కి ఈ ఏరియా సీట్ ను ఇచ్చారు. వీరిద్దరికి కూడా ఈ ఏరియాలో మంచి పట్టు ఉండడంతో ఈ ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక "వై సీ పీ" ఒంటరిగా పోటీ చేస్తూ ఉండడం ... తెలుగు దేశం నుండి పోటీ చేస్తున్న కాగిత కృష్ణ ప్రసాద్ కి జనసేన , బీ జే పీ పార్టీల మద్దతు కూడా ఉండడంతో ఈయనకు ఆ అంశం కొద్దిగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానితో ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య పెడన నియోజక వర్గం లో భారీ యుద్దమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: