శతాబ్ధాలుగా అణిచివేతకు గురైన వ్యక్తులకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల వారికి రిజర్వేషన్ లు రావడంతో వారి జీవితంలో ఒక కొత్త శకం ప్రారంభం అయ్యింది. కాకపోతే ఈ రిజర్వేషన్ ల వల్ల వారి జీవితాలు మెరుగుపడడం , వారు ఉన్నత స్థితికి వెళ్లినప్పటికీ పట్టణ ప్రాంతాలలో వారికి మంచి గౌరవాలు ఎక్కువ శాతం దక్కుతున్నప్పటికీ పల్లెటూరులలో , మారుమూరు గ్రామాలలో మాత్రం కుల వ్యవస్థ కాస్త ఎక్కువ గానే కనబడుతుంది. ఇకపోతే కొంత మంది ఈ కుల వ్యవస్థను తట్టుకొని నిలబడి ఉన్నత చదువులను చదివి గొప్ప స్థాయికి వెళుతున్నారు.

అలాంటి వారు ఈ సమాజంలో తమ చదువుతో , తమ విలువలతో మంచి గుర్తింపును సంపాదించుకొని తమ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. అలాంటి వారిలో కొప్పుల రాజు ఒకరు. ఈయన జాతీయ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో పని చేశారు. ఆ తర్వాత తన డిస్టినేని ఆయనే నిర్ణయించుకున్నారు. అదే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అని ఆయన అనుకున్నారు. అందులో భాగంగా ఈయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గ్యాంగ్ లో ఈయన కీలకమైన వ్యక్తిగా మారారు.

ఇక ప్రస్తుతం ఆయన తన సొంత ప్రాంతం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ను నమ్ముకున్నారు. అందులో భాగంగా ఈయన ఆంధ్ర ప్రదేశ్ నుండి నెల్లూరు జిల్లా నుండి పోటీ చేయబోతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆరు లోక్ సభ , 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన క్యాండిట్ ల లిస్టు ను విడుదల చేసింది. అందులో నెల్లూరు నుండి కొప్పుల రాజు పోటీ చేయబోతున్నాడు. ఇక ఎన్నో కుల వివక్షలను ఎదుర్కొని , చదువుకొని గొప్ప స్థాయికి వెళ్లి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ నుండి నెల్లూరు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. మరి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు ప్రాంతంలో ఏ స్థాయి ఇంపాక్ట్ ను చూపిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: