జనసేన పార్టీ వ్యవహారాలను సైతం నాగబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బిజీగా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే..  అయితే ఈసారి ఎన్నికలకు కాస్త దూరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయినప్పటికీ పార్టీని మాత్రం ప్రజలలోకి తీసుకువెళ్లడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో నాగబాబు "నా ఛానల్ నా ఇష్టం" అనే  పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా నడిపారు. అందులో అటు టిడిపి పార్టీని చాలా ట్రోల్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ వైరల్ గా మారుతుంటాయి. అంతా నా ఇష్టం అనే పాట ఆయనకు బాగా సూట్ అవుతుంది.


మళ్లీ ఇప్పుడు అట్లాంటి నాయకుడు ఎవరంటే రఘురామ కృష్ణరాజు.. అంతా తన ఇష్టం వచ్చినట్టుగానే నడవాలని కోరుకున్నారు.. గతంలో ఆయనకు అనుకూలంగానే జరిగాయి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తన పరిస్థితి అయోమయంలో పడినట్టుగా తెలుస్తోంది. మొదట నేనే తెలుగుదేశం, జనసేన ,బిజెపిని కలిపాను అని చెప్పారు.. నరసాపురం సీటు కూడా తనదేనని చెప్పారు.. కండువా కప్పుకోవాల్సిన అవసరమేంటంటూ అప్పుడు నిలదీశారు.. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా టిడిపి కండువా కప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


భారతీయ జనతా పార్టీ నరసాపురం సీటు తనకు ఇవ్వమని చెప్పడంతో విలవిలలాడుతున్నారు రఘురామ కృష్ణరాజు. చివరికి తెలుగుదేశం పార్టీ నే నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఉండి టికెట్ ఇస్తుందని.. ఇది కాదు పార్లమెంటు సీట్ అని , వీటి చుట్టూ తిరగాల్సి వస్తోంది. గతంలో కూర్చొని మొబైల్ లో మాట్లాడి కథ నడిపితే.. ఇప్పుడు తిరిగి తిరిగి సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పవన్ దగ్గరికి వెళ్లి మీ మద్దతు నాకే ఇవ్వాలి.. ఎక్కడికి వెళ్ళి పోటీ చేయమన్నా చేస్తానంటూ తిరుగుతున్నారు. అయితే పవన్ ను కలిసింది చంద్రబాబుతో చెప్పి సీటు ఇప్పించడం కోసమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.మొట్టమొదటిసారి ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని రఘురామకృష్ణ రాజు కూడా ఊహించి ఉండరేమో..గతంలో అంతా తను అనుకున్నట్టుగానే జరిగింది కానీ ఇప్పుడు మాత్రం అలా ఏమి జరగలేదు. ఇచ్చింది తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రఘురామకృష్ణకు.. మొత్తానికైతే మొదట్లో వీర ప్రగల్బాలు పలికి ఇప్పుడు ఉన్నచోటే నిలువ నీడ లేకుండా చేసుకున్నారు రఘురామకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: