దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఏపీలో కేవలం  కుల సామాజిక వర్గాలకు చెందిన రాజకీయాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు చాలా రసవత్తరంగా  సాగే అవకాశం కనిపిస్తోంది. ఏ అభ్యర్థి కూడా పూర్తిస్థాయి మెజారిటీ  తెచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. ప్రతి నియోజకవర్గంలో  ఎవరు గెలిచిన స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లా  ప్రత్యేకమైనటువంటి రాజకీయ చతురత కలిగి ఉంది. ఈ జిల్లాలోని  తాడికొండ నియోజకవర్గం  రాష్ట్రంలోనే చాలా ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో  పోటీ చేసేది ఎవరు.? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి.? బలాలు,బలహీనతలు తెలుసుకుందాం..

 గత ఎన్నికల్లో  విజయాలు:

 తాటికొండ నియోజకవర్గంలో 1978 నుంచి  ఇప్పటివరకు  12సార్లు ఎన్నికలు జరిగాయి.  ఈ పదిసార్లు ఎస్సీ రిజర్వేషన్ మాత్రమే వచ్చింది. రెండుసార్లు జనరల్ వచ్చింది.  ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు 6సార్లు విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ మూడుసార్లు విజయం సాధించింది. అలాగే సిపిఐ, వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ నుంచి  ఉండవల్లి శ్రీదేవి పోటీ చేసి  తెలుగుదేశం అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పై  86 ఓట్లు తెచ్చుకొని 5వేల మెజారిటీతో   గెలుపొందింది.

2024 ఎన్నికలు:
 ఈసారి ఎన్నికలు తాడికొండ నియోజకవర్గంలో చాలా ఆసక్తికరంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీని వదిలి టిడిపి పక్షాన చేరారు. ఈ క్రమంలోనే  సుచరితను పత్తిపాడులో  కాదని తాడికొండలో పోటీ చేయిస్తున్నారు  జగన్. అంతేకాకుండా గత ఎన్నికల్లో  శ్రీదేవి పై  పోటీ చేసి ఓడిపోయినటువంటి  తెనాలి శ్రవణ్ కుమార్  మరోసారి టిడిపి తరఫున బరిలో ఉన్నారు.

 ఎవరి బలం ఎంత :
 గత ఎన్నికల్లో పత్తిపాడు నుంచి  ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకతోటి సుచరిత  జగన్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆమె ఎంతో పేరు సంపాదించుకుంది. అలాంటి ఈమెను కలిసివచ్చే ప్రధాన అంశం  హోం మంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేయడం, మహిళ ఓట్లు కూడా ఈమెకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.  కానీ ఈమెకు కలిసొచ్చే అంశాల కంటే కలిసిరాని అంశాలు ఎక్కువగా ఉన్నాయి. తాడికొండలో  ఈమె కొత్త అభ్యర్థి కావడం, ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా పత్తిపాడులో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, అంతేకాకుండా  తాడికొండ నియోజకవర్గంలో అమరావతి  రాజధాని ఇష్యూ వల్ల ఇక్కడి ప్రజలు వైసిపిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  ఈ సందర్భంలో ఇక్కడ సుచరిత  గెలుపొందడం అనేది నల్లేరు మీద నడకే అని  ప్రజలు భావిస్తున్నారు.
 
 తెనాలికి కలిసొచ్చే అంశాలు:
 తెనాలి శ్రవణ్ కుమార్  2019 ఎన్నికల్లో గతంలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 5000 మెజారిటీతో మాత్రమే ఓడిపోయారు. ఈ తరుణంలో ఆయన ఈ సారి సానుభూతి ఓట్లు పడడమే కాకుండా,  వైసిపిపై ప్రజల్లో ఉండే వ్యతిరేకత కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: