* పత్తికొండ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది  

* కంగాటి శ్రీదేవికే మొగ్గు చూపుతున్న నియోజకవర్గ ప్రజలు

* ఈసారి కూడా టీడీపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ సాధించే అవకాశం

( రాయలసీమ - ఇండియా హెరాల్డ్)

ఏపీకి చెందిన రాజకీయ నాయకురాలు కంగాటి శ్రీదేవి 2019లో పత్తికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అధిష్టానం ఈసారి కూడా ఆ నియోజకవర్గం టికెట్‌ను ఆమెకే ఇచ్చింది. అక్కడే ప్రజలలో శ్రీదేవికి చాలా ఆదరణ ఉంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా ఆమెకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. కాబట్టి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మరోసారి గెలవడం ఖాయం అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

 శ్రీదేవికి వ్యతిరేకంగా నిలబడిన ప్రత్యర్థులు జనాల్లో పెద్దగా పేరు తెచ్చుకోలేదు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కెఈ శ్యామ్ కుమార్ పత్తికొండ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అయితే అతని గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన శ్రీదేవి కేఈ శ్యామ్‌బాబు పై 42,065 ఓట్ల మెజారిటీతో విజయ బావుటా ఎగరవేశారు. అలా తొలిసారి ఎమ్మెల్యే అయిన ఈమె ఈ ఐదేళ్లలో చాలా మంచి పనులు చేస్తూ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేశారు. పత్తికొండ నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు బ్రిడ్జిల నిర్మాణాలకు కూడా ఆమె మార్గం సుగమనం చేశారు.

సాధారణంగా మాట ఇస్తే నిలబెట్టుకునే తత్వం జగన్ కి ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. శ్రీదేవి సైతం ఇచ్చిన మాట ప్రకారం చాలా హామీలు నెరవేర్చి తన మంచితనాన్ని చాటుకున్నారు. ఇలాంటి నాయకురాలు తప్ప మరేవ్వరికీ ఓటు వేయాల్సిన అవసరం తమకు లేదనే ఆలోచనలో నియోజకవర్గ ప్రజలు ఉన్నట్లు సమాచారం.

ఏపీ అంతటా వైసీపీ పరిపాలన పట్ల చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంది కాబట్టి దాదాపు చాలామంది అభ్యర్థులు కచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో శ్రీదేవి కూడా రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: