ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలనేవి  చాలా ఆసక్తరంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు కూడా   ఆచితూచి అభ్యర్థులను ఎన్నుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక టర్ములో గెలిచినటువంటి పార్టీ, మరో టర్మ్ లో గెలవడం అనేది  చాలా కష్టంతో కూడుకున్న పని. అంతే కాకుండా ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత అనేది ప్రజల్లో ఏర్పడుతుంది. ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకువచ్చినా  కూడా అన్ని వర్గాల ప్రజలకు చేరడం కష్టంగా మారుతుంది.కాబట్టి ప్రజల్లో ఈ వ్యతిరేకత కనిపించడం కామన్. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణతో విడిపోయిన తర్వాత చంద్రబాబు మొదట సీఎం అయ్యారు. 

ఆ తర్వాత జగన్ చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు తెలియపరుస్తూ పాదయాత్ర చేసి చివరికి 2019లో పూర్తిస్థాయి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు.  ఆయన అధి కారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలు  తీసుకు వచ్చినా కానీ కొన్ని వర్గాలకు మాత్రమే అందాయి. మిగతా వర్గాలకు అన్యాయం జరిగిందని ఏపీలోని కొంతమంది ప్రజల్లో బలంగా చెబుతున్నారు.. ఇలాంటి తరుణంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది చంద్రబాబే అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే..  

కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా  చంద్రబాబుకు అలాగే మాజీ మంత్రులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా టీడీపీ ఎక్క డెక్కడ కాస్త డల్ గా ఉందో  అక్కడ ఎలాంటి పనులు చేయాలో వారికి స్వయంగా సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నట్టు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ,  ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఒకటి సామజిక మధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మరి చూడాలి అధికారులు అంచనాలు వేసిన దాని ప్రకారం టీడీపీ అధికారంలోకి వస్తుందా, లేదంటే వైసిపి మళ్ళీ గెలుస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: