•కులాంతర వివాహాలే సక్సెస్ కు పునాది
•రాయలసీమలో ఈ మహిళా నేతలకు కలిసి వచ్చింది అదే
•భర్తల సామాజిక వర్గమే బలం

(రాయలసీమ - ఇండియా హెరాల్డ్)
సాధారణంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. కానీ రాజకీయాలలో కులాంతర వివాహం  అనేది రాజకీయంగా బాగా కలిసొస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చాలామంది నేతలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని.. తమ భార్యల ద్వారా  రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి రాయలసీమ విషయానికి వస్తే.. ముగ్గురు మహిళ నేతలు రాజకీయంగా సక్సెస్ కావడానికి కారణం వారి వెనుక ఉన్న భర్తలు.. ఆ భర్తల సామాజిక వర్గ బలం అని చెప్పవచ్చు.. ప్రత్యేకించి ముగ్గురు రాయలసీమ మహిళా నేతల రాజకీయ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు చూద్దాం

ఉష - శ్రీ చరణ్ రెడ్డి:
2019 ఎన్నికల్లో భాగంగా వైసీపీ తరఫున పోటీ చేసి కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా గెలిచి.. ఏపీ మంత్రిగా చేసింది ఉష శ్రీ చరణ్.. ఈమె సొంత ఊరు రాయదుర్గం. శ్రీ చరణ్ రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకొని కర్ణాటకలో సెటిల్ అయ్యారు. 2019 ఎన్నికల ముందు కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారు. భర్త శ్రీ చరణ్ రెడ్డి వల్లే ఆమెకు టికెట్ వచ్చిందని స్థానికంగా చక్రం తిప్పేదంతా ఆమె భర్త అని చెప్తూ ఉంటారు. టిడిపి కంచుకోటగా ఉన్న కళ్యాణ్ దుర్గం లో ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ గెలవడం ఒక సంచలనం అయితే.. తరువాత మంత్రి కావడం మరో ఆశ్చర్యకర పరిణామం.. ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ కురబ సామాజిక వర్గానికి చెందిన వారైతే.. శ్రీ చరణ్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు.. వీరు రాజకీయంగా సక్సెస్ కావడానికి కారణం ఈ రెండు వర్గాలు.. పైగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ బాగా కలిసి వచ్చాయని చెప్పవచ్చు.


ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి - సాంబ శివారెడ్డి:
మరొకవైపు జొన్నలగడ్డ పద్మావతి .. శింగనమల ఎమ్మెల్యేగా వైసిపి తరఫున 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చింది. జొన్నలగడ్డ పద్మావతి sc సామాజిక వర్గం. ఈమె ఆలూరు సాంబశివరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు.. వైయస్ మరణం తర్వాత జగన్ వైసీపీ పార్టీ పెట్టడంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సాంబశివారెడ్డి. పొలిటికల్ గా ఆసక్తి ఉండడం పైగా  శింగనమల ఎస్సీ రిజర్వ్డు కావడంతో తన భార్య పద్మావతిని పోటీకి దింపారు. 2014లోనే బరిలో ఉన్నా గెలవలేదు.. 2019లో భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు పద్మావతి. మొత్తానికి అసెంబ్లీకి వెళ్లాలన్న తన కోరికను భార్య ద్వారా నెరవేర్చుకున్నారు సాంబశివారెడ్డి.

కురుబ దీపిక - వేణుగోపాల్ రెడ్డి:
కురుబ దీపిక  వైసీపీ ఇన్చార్జిగా కొనసాగి.. ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తోంది. దీపిక భర్త స్థానికంగా కాంట్రాక్టర్.. దీపిక కురబ ఆమె భర్త వేణుగోపాల్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ రెండు వర్గాల ఓట్లు హిందూపురంలో ఎక్కువగా ఉండడంతో కచ్చితంగా తమను గెలిపిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు..

మరోవైపు ఈ మూడు జంటల మధ్య 3 కామన్ పాయింట్స్ ఉన్నాయి.. అందులో మొదటిది వీరి ముగ్గురిదీ లవ్ మ్యారేజ్.. రెండవది అధికార పార్టీ వైఎస్ఆర్సిపి లో లీడర్స్.. అలాగే మూడవది వీరి భర్తలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు.. ఇక కులాంతర వివాహాలు చేసుకున్న ఈ ముగ్గురి జంటలకు.. భర్తల సామాజిక వర్గం బలంగా మారి.. ఈ మహిళలకు రాజకీయంగా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ మూడు కులాంతర వివాహాల గనుక రాజకీయ హస్తం ఉందా అనే వార్త తెరపైకి వచ్చిన ఇదంతా యాదృచ్ఛికంగానే జరిగిందనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: