అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో వైసీపీ చేస్తున్న కసరత్తులు ఇంకా కొనసాగుతూనే వున్నాయని సమాచారం తెలుస్తుంది.ఇక అక్కడ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ కూటమి అభ్యర్ధి సీఎం రమేష్. ఆయన అంగబలం అర్ధబలంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అందుకే ఎన్నో జిల్లాలను దాటుకుని మరీ ఆయనను తీసుకుని వచ్చారు.అందుకే వైసీపీ అధిష్టానం లోకల్ కార్డుతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని పోటీకి దించింది. అన్ని విధాలుగా సమర్ధుడైన నేతగా బూడి ఉన్నారు. కానీ సీఎం రమేష్ అర్ధబలం అంగబలాన్ని తట్టుకునే విషయంలో మాత్రం పార్టీ కొంత ఆలోచించాల్సి వస్తోంది.అందుకే ఇప్పుడు వైసీపీలో సరికొత్త ఆలోచనలు సాగుతున్నాయని సమాచారం తెలుస్తుంది. బూడిని తిరిగి మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్ధిగానే కొనసాగిస్తూ అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ గా కొత్తవారికి పోటీలోకి దింపాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు.


ఇక అనకపల్లిలో ప్రభావితమైన సామాజిక వర్గాలలో గవరలు కూడా ఉన్నారు. ఆ సామాజిక వర్గం నుంచి అసెంబ్లీకి ఎంపీకి సీటు ఇవ్వలేదని సమాచారం తెలుస్తుంది. అసెంబ్లీ బరిలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ ఎంపీగా వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడిని రంగంలోకి దింపింది. ఇప్పుడు క్యాష్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ సరిపోయేలా గవర సామాజిక వర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిని పోటీలోకి దించాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అంగబలం అర్ధబలంలో ధీటైన అభ్యర్ధిని బరిలోకి దించి బూడిని మాడుగులకు పంపిస్తే రెండు చోట్ల బ్లాక్ బస్టర్ విక్టరీ కొట్టవచ్చని ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మాడుగుల నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్న క్రమంలో ఆయనను ఓడించాలంటే బూడిని అసెంబ్లీ నుంచే పోటీకి పెట్టడం సబబు అని ఆలోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే వైసీపీ అధిష్టానం చేస్తున్న ఈ మార్పుల ప్రచారంలో నిజం ఎంత అన్నది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు అని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: