ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రోసారి కూడా విజ‌యం ద‌క్కించుకునేం దుకు ప్ర‌య‌త్నిస్తున్న వైసీపీ నాయ‌కుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు డీలా ప‌డుతున్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. ఒక‌ప్పుడు హార‌తులు ప‌ట్టిన‌.. ప్ర‌జ‌లు ఇప్పుడు ఆయ‌న‌కు దూరంగా ఉంటున్నారు. బొల్లా వ‌స్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లోని వారు.. వేరే ప‌నులు ఉన్నాయ‌ని.. చెబుతూ ఇంటి నుంచివెళ్లిపోతున్నారు. దీంతో బొల్లా ప‌ర్య‌ట‌న‌లు డొల్ల‌గా మారుతున్నాయి.

అయితే.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. అంతా చేసుకున్న‌దేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అధికారం లో ఉన్న‌ప్పుడు.. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌లేద‌ని.. ఇప్పుడు వ‌చ్చి ఓట్లు ఎలా అడుగుతార‌ని ప్ర‌శ్ని స్తున్నారు. మ‌రికొంద‌రు బొల్లా త‌న‌యుడు గిరిబాబు దూకుడును చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌తి దానికీ రేటు క‌ట్టి వ‌సూలు చేసేవార‌ని.. ఇలాంటి ప‌రిస్థితిని తాము నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని అంటున్నారు. ఇక బొల్లా ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు వినుకొండ‌లో జ‌రిగిన అభివృద్ధికి అంతే లేద‌న్న విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నాయి.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి స‌మ‌స్య‌.. బొల్లాకు మ‌రింత సెగ పుట్టిస్తోంది. ప‌థ‌కాలు అందుకున్న వారు కూడా.. బొల్లా ద‌య‌వ‌ల్ల వ‌చ్చింద‌ని చెప్పక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వ‌లంటీర్లు త‌మ పేర్ల‌ను రాసుకుని.. అర్హ‌త ఉంది కాబ‌ట్టి ఇచ్చార‌ని.. బొల్లా వ‌ల్ల వ‌చ్చింది ఏమీ లేద‌ని చెబుతు న్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బొల్లాకు రైట్ హ్యాండ్‌గాఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గంలో స‌గం మంది దూర‌మ‌య్యారు.

అంతేకాదు.. క‌మ్మ సామాజిక వ‌ర్గం పూర్తిగా దూరం పెట్టింది. బుధ‌, గురువారాల్లో ప్ర‌త్యేకంగా క‌మ్మ వ‌ర్గంతో స‌మావేశం ఏర్పాటు చేసినా.. స‌గం సీట్లు కూడా నిండ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌త ఐదేళ్ల‌లో త‌మ‌కు క‌నీసం ద‌ర్శ‌నం కూడా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోయార‌ని క‌మ్మ వ‌ర్గం ఆరోపిస్తోంది. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిచేందుకు కూడా త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని.. స్థానికంగా తాము ప్ర‌చారం చేసే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు.

ప్ర‌జ‌ల‌కు క‌నీసం అందుబాటులో లేక‌పోగా.. ప్ర‌శ్నించిన వారిని పురుగులుగా చూశార‌ని.. నువ్వు టీడీపీ నుంచి ఎంత‌తిన్నావ్ ? అంటూ.. ఎదురు ప్ర‌శ్నించార‌ని.. ఇప్పుడు తాము ప‌నిచేయ‌లేమ‌ని మొహం చాటేస్తున్నారు. దీంతో బొల్లా దాదాపు డీలా ప‌డిపోయార‌ని.. ఎన్నిక‌ల‌కు ముందే చేతులు ఎత్తేశార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి వ‌చ్చే వారంలో అయినా.. పుంజుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: