- బాలినేని - మాగుంట మీద కోపంతో చెవిరెడ్డికి ఒంగోలు పార్ల‌మెంటు సీటు
- జ‌గ‌న్‌కు బాగా న‌మ్మిన బంటుగా చెవిరెడ్డి కుటుంబం
- రెండు కంచుకోట్ల‌లో ఒకే ఫ్యామిలీకి ఛాన్స్ అంటే పెద్ద ల‌క్కే

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
వైయస్ జగన్మోహన్ రెడ్డికి కోపం వస్తే ఏం జరుగుతుందో ? అప్పటివరకు తమ పార్టీలో ఎంత గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న నేతలు అయినా ఎలా మాయం ? అయిపోతారో చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉన్న మాగుంట ఫ్యామిలీకి జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. నెల్లూరు - ప్రకాశం జిల్లాలను కేంద్రంగా చేసుకొని పలుమార్లు చట్టసభలకు ఎంపికైన ఘనత మాగుంట కుటుంబానిది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు మాగుంట‌ శ్రీనివాసులు రెడ్డి. ఆయనను వైసీపీలో చేర్చుకున్న జగన్ ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు.


వైసీపీ ప్రభంజనంలో మాగుంట ఏకంగా 2 లక్షల పై చిలుకు ఓట్లతో ఒంగోలు ఎంపీగా ఘనవిజయం సాధించారు. అనంతరం జగన్ కు మాగుంట ఫ్యామిలీకి ఎక్కడో చెడింది. త‌న‌కు మామ వ‌రుస అయ్యే మాజీ మంత్రి.. వైసీపీ కీల‌క నేత‌గా ఉన్న‌ బాలినేని పట్టుబట్టినా కూడా జగన్ మాగుంట‌కు ఒంగోలు ఎంపీ టిక్కెట్టు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న తనకు అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు నుంచి రంగంలోకి దింపారు.


చంద్రగిరి సీటును చెవిరెడ్డి తనయుడు చంద్రగిరి మోహిత్ రెడ్డికి కేటాయించారు. అలా జగన్ కు బాలినేని మీద లేదా మాగుంట మీద ఉన్న కోపం చెవిరెడ్డి ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. చెవిరెడ్డి ఫ్యామిలీకి జగన్ బంపర్ ఫ్యామిలీ ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారు. అటు చెవిరెడ్డికి ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తే ... ఆయన తనియుడు మెహిత్ రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. వైసీపీలో చాలామంది నేతలు రెండు టిక్కెట్లు ఆశించినా వారు ఎవరికి దక్కని అద్భుతమైన అవకాశం చెవిరెడ్డి ఫ్యామిలీకి దక్కిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: