ఎన్నికల సీజన్ లో ఎండలు ఠారెత్తిస్తుండగా.. రాజకీయ నాయకుల విమర్శలు నిప్పులు కురిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని భావిస్తున్న చంద్రబాబు తనకు తోడుగా బీజేపీ, జనసేనలను కలుపుకొని వెళ్తున్నారు. ఇదే సమయంలో జగన్ మాత్రం ఒంటరిగా పోటీకి సిద్ధం అయ్యారు.


అయితే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఏ మేర వెంపర్లాడారో అందరికీ తెలిసిందే. దీనిపై చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను వైసీపీ కీలక నేత.. ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. పొత్తుల కోసం దిల్లీలో గంటల తరబడి పడిగాపులు కాసిన చంద్రబాబు.. ఎన్డీయేలో లోకి టీడీపీ చేరేందుకు తానే కృషి చేశానని పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ సంగతి ఇలా ఉంటే.. చంద్రబాబు హస్తినలో అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు.


ఈ సమయంలో చంద్రబాబు దిల్లీలో ఉండగానే జగన్ హస్తినకు పయనమై వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ లో ప్రధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.  ఒలా ఒకవైపు చంద్రబాబుతో చర్చలు జరుపుతూ.. మరోవైపు జగన్ తో సుదీర్ఘ భేటీ పై అప్పట్లో రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగింది. ఈ సమయంలో ప్రధాని మోదీ జగన్ కు ఓ ఆఫర్ ఇచ్చారని విజయసాయి చెబుతున్నారు. తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరాలని తొలుత తమ పార్టీకి అవకాశం వచ్చిందని వివరించారు.


అయితే తమ పార్టీ విధానాల వల్ల ఇది సాధ్యం కాదని పార్టీ పెద్దలకు జగన్ స్పష్టం చేశారు. జగన్ రిజక్ట్ చేస్తే అప్పుడు టీడీపీని బీజేపీ తమ కూటమిలోకి చేర్చుకుందని వివరించారు. తనకు గవర్నర్ కావాలనే కోరిక ఉన్నట్లు విజయసాయి వెల్లడించారు. ఈ విషయాన్ని జగన్ కు సైతం తెలిపానన్నారు. ఫైనల్ గా జగన్ ఆదేశాల మేరకే పనిచేస్తానని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: