ఏపీలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అన్ని పార్టీలు సంక్షేమం అమలు చేస్తామని చెబుతున్నాయి. ఇప్పటి వరకు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు యూ టర్న్ తీసుకోక తప్పడం లేదు. ఇన్నాళ్లూ అభివృద్ధిని చంద్రబాబు నమ్ముకున్నారు. కానీ ప్రగతి పాటు సంక్షేమ పథకాల విషయంలో హామీ ఇస్తే కానీ ప్రజలు ఓటేసేలా లేరు.


అందుకే తాము అధికారంలోకి వస్తే జగన్ కు మించిన పథకాలు అందిస్తామని చెబుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు పలు కీలక అంశాల్లో చంద్రబాబు ఇస్తున్న ప్రకటనలు, హామీలు చూస్తుంటే.. జగన్ ని తప్పు బట్టి ఆయన్ను మించిన హామీలు ఇస్తున్నారు. అంటే .. జగన్ పదవి నుంచి దిగిపోతే..ఆయన్ను మించిన జగన్ అధికారంలోకి వస్తారు.  మరి వైసీపీ పాలన బాగాలేదని.. ఎలా చెబుతారు అనేది ఇక్కడ ఆసక్తికర అంశం.


జగన్ గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. దీంతో అబివృద్ధి లేదన్న అపవాదు ఉంది. అటు విపక్షాలు ఇదే అంశంపై జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఉచిత పథకాల మాటున ఏపీని శ్రీలంక మాదిరిగా మార్చారని.. 20 ఏళ్ల పాటు ఏపీ వెనక్కి వెళ్లిందని దీనంతటకీ నగదు పంపిణీనే కారణమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఆరోపించారు.


తీరా ఇప్పుడు చూస్తే.. జగన్ ను మించి పథకాలను ప్రకటిస్తున్నారు. ఆది నుంచి వాలంటీర్లను తిట్టి ఇప్పుడు ఆ వ్యవస్థ ను కొనసాగిస్తాం అధికారంలోకి వస్తే రూ.10వేల గౌరవ భృతి ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు పింఛన్లను రూ.4000వేలకు పెంచి.. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామనిప్రకటించారు. సూపర్ సిక్స్ హామీలు కాకుండా ఇవి అదనం. ఇన్నాళ్లూ ఉచిత పథకాలతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోతుందని విమర్శించిన వారే.. ఇప్పుడు అదే బాట పట్టడం గమనార్హం. ప్రజలు దీనిని ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: