- ధ‌ర్మాన కుటుంబంలో ముగ్గురు సోద‌రులు ఎన్నిక‌ల్లో పోటీ..!
- రెండు ద‌శాబ్దాలుగా పార్టీలు మారినా గెలుస్తున్న ప్ర‌సాద్‌, కృష్ణ‌దాస్‌
- అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ మంత్రులైన రికార్డ్‌

( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
సుదీర్ఘ కాలం పాటు ఒకే కుటుంబానికి చెందిన సొంత అన్నదమ్ములు రాజకీయాలు చేయటం.. అందులోనూ విజయాలు సాధిస్తూ ఉండటం అంటే మామూలు విషయం కాదు. విచిత్రం ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు పార్టీలు మారి కూడా అక్కడ కూడా సక్సెస్ అవ్వటం అంటే గొప్ప విషయమే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరులు కూడా ఈ కోవ‌లోకి వస్తారు. ధర్మాన సోదరుల రాజకీయ ప్రస్థానం ముందుగా కాంగ్రెస్ పార్టీతో ప్రారంభం అయింది. ఆ తర్వాత ధర్మాన సోదరులు ఇద్దరు వైసీపీలోకి వచ్చి ఇక్కడ కూడా వరుస విజయాలు సాధిస్తున్నారు.


ముందుగా ధ‌ర్మాన ప్ర‌సాద రాజు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అవ్వడంతో పాటు మంత్రి కూడా అయ్యారు. అయితే 2004 ఎన్నిక‌ల టైంలో ధ‌ర్మాన త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన న‌ర‌స‌న్న‌పేట ను వ‌దులుకుని జిల్లా కేంద్ర‌మైన శ్రీకాకుళంకు వ‌చ్చారు. అప్పుడు ధ‌ర్మాన పెద్ద సోద‌రుడు కృష్ణ దాస్ న‌ర‌స‌న్న‌పేట నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రూ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ధ‌ర్మాన మంత్రి అయ్యి జిల్లా రాజ‌కీయాల‌ను త‌న క‌ను సైగ‌ల‌తో శాసిస్తూ వ‌చ్చారు.


ఆ త‌ర్వాత సోద‌రులు ఇద్ద‌రు 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వెళ్లారు. అంత‌కంటే ముందు కృష్ణ‌దాస్ వైసీపీలోకి వెళ్లి 2012 ఉప ఎన్నిక‌ల్లోనూ న‌ర‌స‌న్న పేట నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో సోద‌రులు ఇద్ద‌రూ ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నిక‌ల్లో సోద‌రులు ఇద్ద‌రూ మంత్రులు అయ్యారు. ముందు కృష్ణ‌దాస్ మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. త‌ర్వాత ప్ర‌క్షాళ‌న‌లో ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ను త‌ప్పించిన జ‌గ‌న్ ప్ర‌సాద రావుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.


ఇక తాజా ఎన్నిక‌ల్లోనూ ఈ ఇద్ద‌రు మ‌రోసారి వైసీపీ నుంచే అసెంబ్లీకి పోటీ ప‌డుతున్నారు. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన సోద‌రుల రాజ‌కీయ భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో ?  చూడాలి. ఇక ధ‌ర్మాన సోద‌రుల మ‌రో సోద‌రుడు కూడా 2012 ఉప ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మీదే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: