ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. మే 13 న అసెంబ్లీ, పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి..అయితే సీటు దక్కని నేతలు మాత్రం చాలా అసంతృప్తిగా వున్నారు. పార్టీ కార్యక్రమాలుకు దూరంగా ఉంటూ వస్తున్నారు..అధికార పార్టీ వైసీపీ ఈ సారి ఎన్నికలలో సామాజిక సంస్కరణలో భాగంగా  సీట్లు కేటాయించడం జరిగింది. దీనితో కొందరు సీనియర్లకు సీటు దక్క లేదు. సీటు దక్కని నాయకులను పిలిపించి జగన్ అధికారంలోకి రాగానే వారికీ న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగనున్నాయి. ఈ సారి ఎలాగైనా జగన్ ను గద్దె దించాలనే ఉద్దేశంతో ప్రధాన ప్రతి పక్షాలు అయిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. అయితే పొత్తులో భాగంగా కూటమిలో కూడా చాలా మంది అభ్యర్థులకు సీటు లభించలేదు.. దీనితో అక్కడి అభ్యర్థులు కూడా ఎంతో అసంతృప్తితో వున్నారు.

కూటమి లో అసంతృప్తిలో వున్న అభ్యర్థులను వైసీపీ అధిష్టానం తమ పార్టీలో చేర్చుకొని వారికీ సీట్లు కేటాయిస్తుంది. దీనితో వైసీపీ అసంతృప్తి వర్గం మరింత నిరాశలో ఉంది. దీనితో కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చిట్టిబాబుకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నానని చిట్టిబాబు తన రాజీనామా లేఖలో వెల్లడించారు.వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పి. గన్నవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. పి. గన్నవరం సీటు కోసం చివరి వరకూ ప్రయత్నించిన చిట్టిబాబు తనకు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: