ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి.. అధికార, ప్రతి పక్షాలు ప్రచారంలో దూకుడు చూపిస్తున్నాయి. వైసీపీ నేత జగన్ పార్టీలో అంతర్గత విభేదాలకు చోటుండకూడదని పార్టీ నేతలకు సూచనలు చేశారు. అభ్యర్థులకి తమ నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలకు తావుండ కూడదని సూచించారు. నియోజకవర్గంలో కార్యకర్తలు అందరిని కలుపుకొని పోవాలని దిశా నిర్దేశం చేశారు. దీనితో వర్గ పోరు వున్న ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరగకుండా జగన్ ముందు జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ప్రధాన ప్రతి పక్షం టీడీపీ లో విబేధాలు చోటు చేసుకుంటున్నాయి.శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు మరియు ఎంపీగా రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహనాయుడు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి వరుసగా మూడోసారి ఎంపీ బరిలో నిల్చున్నారు.ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఆయన మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.అయితే అంతర్గత విబేధాలు రామ్మోహన్ హ్యాటిక్ విజయాలకు బ్రేక్ వేస్తాయేమో అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రామ్మోహన్‌ నాయుడుకు కొన్ని చోట్ల నుంచి అంసతృప్తుల బెడద ఉందని సమాచారం.ముందు నుంచి ఉన్న టీడీపీ ఇంచార్జ్ లను కాకుండా రెబల్స్ నేతలకు ప్రమోషన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడుకు టీడీపీ ఇంచార్జ్ లు సహకరించమని అంటున్నారు.. దీంతో వర్గ విభేదాలు రామ్మోహన్ నాయుడుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.అద్భుతమైన వాగ్ధాటి వున్న టీడీపీ ఎంపీ గా రామ్మోహన్ నాయుడు మంచి గుర్తింపు పొందాడు.. పార్లమెంట్ లో ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా సమాధానమిచ్చే రామ్మోహన్ నాయుడు గత రెండు సార్లు గెలిచి ఈ సారి హాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. అయితే రామ్మోహన్ నాయుడుకు మాత్రం బాబాయ్ అచ్చెన్నాయుడు దూకుడు నిర్ణయాలు కాస్త ఇబ్బంది పెడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: