రాయలసీమ రాజకీయాలకు అడ్డ ఉమ్మడి కడప జిల్లా.. వైయస్ హవా తర్వాత అక్కడ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి మార్కు సహాయంతో ఆ కుటుంబం అక్కడ పట్టు సాధించింది. రాయచోటి నియోజకవర్గం గురించి మాట్లాడితే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే వ్యక్తి గండికోట శ్రీకాంత్ రెడ్డి.. గండికోటకు వైసీపీకి కంచుకోట రాయచోటి.. ఇక్కడి రాజకీయం ఎప్పుడూ కూడా రసవత్తంగానే ఉంటుంది.దీంతో ఈసారి టిడిపి జెండా ఎగరేయాలని చూస్తోంది.


గండికోట శ్రీకాంత్ కు రాజకీయ కుటుంబ నేపథ్యం బాగా కలిసి వచ్చిన అంశం. అంతేకాకుండా వరుసగా నాలుగు సార్లు గెలవడానికి కూడా కారణం అక్కడి ప్రజలే..  రాయచోటి నియోజకవర్గం నుంచి తనకు బలమైన మద్దతు ఉన్నది. వీటన్నింటి తోపాటు పూర్తిగా సహకరించే క్యాడర్ కూడా ఉండడంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు గండికోట శ్రీకాంత్ రెడ్డి. అంతేకాకుండా నియోజవర్గంలో మరో బలమైన నేత అక్కడ లేకపోవడమే..

అటువంటి శ్రీకాంత్ రెడ్డి పై కూడా అక్కడ కొంతమేర వ్యతిరేకత ఏర్పడుతోంది.. ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో  వున్న వాలంటరీలు కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీని కారణంగానే ప్రభుత్వంపై ప్రజలలో కాస్త వ్యతిరేకత ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది.


మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఈయన ఈసారి గండికోట శ్రీకాంత్ రెడ్డికి ఆపోజిట్ గా టిడిపి పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఈయనకు కలిసొచ్చే అంశాల విషయానికి వస్తే..


గత ఎన్నికలలో ఓడిపోయారనే సింపతి ఈయనకు బాగా కలిసొచ్చే అవకాశం ఉన్నది.

తండ్రి రాజకీయ వారసత్వం కూడా ఈయనకి కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఈయన మైనస్ పాయింట్ విషయానికి వస్తే...  ప్రజలలో ఎక్కువగా గుర్తింపు లేకపోవడం ప్రధానమైనటువంటి అద్దంకిగా కనిపిస్తోంది.


తరచూ పార్టీలు మారుతున్నారనే ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది.


రాయచోటి నియోజకవర్గం లో ముస్లిం ఓటు శాతం 26 %.. రెడ్డి ఓటర్ల శాతం 19%... ఎస్సీ 13% , బలిజ 10 % ఎస్ టీ 5% ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ అధిక సంఖ్యలో ముస్లింలే ఉన్నారు. అయితే ముస్లింలలో 60 శాతం వైసీపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. అక్కడ సరైన ప్రాతినిధ్యం తమకు ఇచ్చారని ప్రతిపాదన వినిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్,  ఎమ్మెల్సీ వంటి కీలక పదవులు కూడా ముస్లింలకే ఇచ్చారట. మిగిలిన 40 శాతం మంది ఓటర్లు టిడిపి పార్టీకి ఉన్నారు. మిగిలిన ఓటర్లలో కులాల వారీగా అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈసారి రాయచోటి నియోజకవర్గంలో అటు శ్రీకాంత్ రెడ్డి ఇటు మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు.. మరి ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఐదవ సారి ఆయన విజయం సాధించినట్లు అవుతుంది. మరి ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: