వైఎస్ షర్మిల తెలంగాణ వదిలి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. సొంత అన్నయ్యకు వ్యతిరేకంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ప్రచారాలు సాగిస్తున్న ఆమె జగన్ పాలన చెత్తగా ఉందని మాట్లాడుతూ చాలామందికి షాక్ ఇస్తున్నారు. మొన్నటిదాకా జగన్ తో కలిసి ఉన్న షర్మిల ఇప్పుడు బహిరంగంగానే అతడిని విమర్శిస్తున్నారు. మరోవైపు సౌభాగ్యమ్మ, సునీత కూడా జగన్ కి వ్యతిరేకమయ్యారు. వారు చంద్రబాబుకి దగ్గరయ్యారు కానీ టీడీపీలో వారిని చేర్చుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. ఒక వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా వారిని పార్టీకి దూరంగా ఉంచారు. ఎందుకంటే టీడీపీలోకి వెళ్లి జగన్ పై వివేకానంద రెడ్డి హత్య గురించి ఆరోపణలు చేసినా వాటికి విలువ లేకుండా పోతుంది.

ఈ ప్రణాళికలో భాగంగా భూపేష్ రెడ్డికి పార్లమెంటు సీటు ఇచ్చారు. షర్మిల వైసీపీ ఓట్లను చీల్చితుందేమో అని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఆమె కడపలో ప్రచారంతో వైసీపీలో వణుకు కూడా పుట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రాష్ట్రంలో చాలా చోట్ల తిరుగుతున్నారు. ఎక్కువ ప్రాంతాలలో జగన్ మద్దతుదారులు ఆమెను తిరస్కరిస్తున్నారు కానీ మరి కొన్ని ప్రాంతాలలో ఆమెకు సపోర్ట్ లభిస్తుంది. అక్కడ ఓట్లు కోల్పోతామేమో అనే భయం వైసీపీ నేతలకు పట్టింది.

ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన అన్నీ కలిసి ఒకటయ్యాయి. మరోవైపు షర్మిల కూడా జగన్ ఓటర్లనే టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల భారీగా ఓట్లు లాస్ అవుతావేమో అని భయపడుతున్నారు. ఈ కారణం చేత వారిలో కాస్త కలవరం అనేది కూడా పెరిగిపోతుంది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా షర్మిల కారణంగా వైసీపీ అధిష్టానంలో ఎంతో కొంత భయం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈసారి జగన్ మంచి మెజారిటీతో గెలుస్తారని విశ్లేషకులు, సర్వేలు తెలుపుతున్నాయి. మరి ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: