ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.. ముఖ్యంగా నిన్నటి రోజున రాత్రి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా నానా రచ్చ చేస్తున్నారు. ఈ దాడికి కారణం చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారంటూ కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా నగరి వైసిపి మంత్రి రోజా తమ నేతపైన జరిగిన దాడి గురించి ఇలా వ్యాఖ్యలు చేసింది.

తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన బస్సు యాత్ర సందర్భంగా జరిగిన రాళ్లదాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటన పైన టిడిపి రాజకీయం చేస్తోందని.. త్వరలోనే నిజా నిజాలు వెలుగులోకి వస్తాయనే విషయాలను కూడా చాలామంది నేతలు తెలియజేస్తున్నారు. దీనిపైన ఎన్నికల కమిషనర్ కూడా వెంటనే విచారణ జరపాలంటూ పలువురు వైసీపీ నేతలు తెలియజేశారు. తమ నేత పై దాడి జరగడంతో నగరి మంత్రి ఆర్కే రోజా ఆగ్రహాన్ని తెలియజేశారు.


దీంతో సీఎం పైన జరిగిన దాడిని నిరసిస్తూ పుత్తూరు లో రోడ్డుపైన బైఠాయించి మరీ నినాదాలు చేస్తోంది.సీఎం జగన్ పైన దాడి పవన్ , చంద్రబాబు కుట్రే అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యింది. ఈ విషయం పైన వెంటనే ఎన్నికల కమీషనర్ స్పందించాలంటూ, పవన్,  చంద్రబాబు పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే రోజా నానా రచ్చ చేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్టు చేయాలని అలాగే ఈ దాడి వెనక ఎవరెవరు ఉన్నారో.. అసలు విషయాలు పోలీసులు తేల్చాలంటూ డిమాండ్ చేసింది నగరి మంత్రి రోజా. ప్రస్తుతం రోజా చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు అటు రాజకీయాలలో కాక రేపేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: