ఇటీవల ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వెళ్లిన సమయంలో ఏకంగా ఆయనపై రాయి దాడి జరిగిన ఘటన ఆంధ్ర రాజకీయాల్లో ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా అక్కడికి వచ్చిన వ్యక్తుల్లో నుంచి ఒక వ్యక్తి గట్టిగా రాయిని విసరగా.. అది నేరుగా వెళ్లి సీఎం జగన్ కన్నుపైన తగిలింది  అయితే ఇక కనుబొమ్మకు నాలుగు కుట్లు పడినట్లు అటు వైద్యులు కూడా తెలిపారు. సీఎం జగన్కు దెబ్బ తగిలిందో లేదో ఇక ప్రతిపక్ష పార్టీలను ఏకీపారేస్తు ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది వైసిపి పార్టీ.


 అదే సమయంలో గతంలో కోడి కత్తి డ్రామా మొదలుపెట్టినట్లుగానే ఇక ఇప్పుడు జగన్ మరోసారి ఇలా రాయి డ్రామా మొదలుపెట్టారు అంటూ టిడిపి జనసేన బిజెపి నేతలు అందరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఇంకెక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చా అని అంటుంది అంటూ టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సైతం ఎద్దేవా చేశారు. ఇంత జరుగుతుంటే అక్కడే ఉన్న కార్యకర్తలు పోలీసులు నిందితున్ని ఎందుకు పట్టుకోలేదు అంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.


 సరిగ్గా కనుబొమ్మపై తగిలేలా కొట్టేంత ఏకలవ్యుడు  జగన్ జమానాలో ఉన్నారేమో అంటూ సెటైర్లు వేస్తున్నాయి ప్రతిపక్షాలు. అంత మంది పోలీసులు మధ్యలో సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని కొట్టడం అంత ఆషామాషీ విషయం కాదు విమర్శిస్తున్నాయ్. మరోవైపు సీఎం జగన్ పై ఇక రాయి దాడి జరిగింది అన్న విషయం మీడియాలో రాగానే ఏకంగా ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే సానుభూతి కోసమే జగన్ స్వయంగా దాడి చేయించుకున్నాడని.. జనాలకు అంతా తెలుసు అంటూ ప్రతిపక్షాలు అంటుంటే ఇక ఈ దాడి ప్రతిపక్షాలే చేశాయ్.. ఈ దాడితో ఆంధ్ర ప్రజలు బాధపడుతున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. మరి నిజంగానే వైసీపీ చెప్పినట్లు ఏపీ ప్రజలు బాధపడుతున్నారా లేదంటే.. ప్రతిపక్షాలు అంటున్నట్లు కేవలం అవన్నీ డ్రామాలేనా అన్నది ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: