ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి.. నిన్నటి రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో కొంతమంది ఆఘంతకులు జగన్ పైన రాయి విసరడంతో గాయమైంది. దీంతో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా ఈ విషయం పైన నానా హంగామా చేస్తున్నారు ఇప్పటికే ఎలక్షన్ అధికారికి కూడా కంప్లైంట్ ఇవ్వడంతో నిందితులని గుర్తించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు... అంతేకాకుండా ఇది కావాలనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేయించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


అయితే ఇప్పుడు తాజాగా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్న సమయంలో ఈరోజు గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తెనాలికి చేరుకున్నారు. అలా హెలిప్యాడ్ నుంచి ర్యాలీకి బయలుదేరుతున్న పవన్ కళ్యాణ్ సుల్తానాబాద్, చెంచుపేట.. రైల్వే ఫ్లైఓవర్ మీదుగా మహాత్మా గాంధీ మున్సిపల్ వేదికగా కొనసాగిస్తున్నారు.. అయితే అలా గుంటూరు జిల్లా తెనాలి నుంచి కొనసాగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ పైన రాయి విసిరారు.


అయితే ఈ రాయి పవన్ కళ్యాణ్ కు తృటిలో తప్పిపోయినట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ అప్రమత్తమైన పలువురు జనసేన కార్యకర్తలు నిందితులను  పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం విన్న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. ఈ పని కావాలని కొంతమంది రాజకీయ నాయకులు చేయిస్తున్నట్లుగా పలువురు నేతలు కూడా వాపోతున్నారు. నిన్నటి రోజున సీఎం జగన్ మీద ఇలాంటి ఘటన జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ మీద జరగడంతో అటు ఇరువురి కార్యకర్తల నడుమ ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. మరి సెక్యూరిటీ పెంచాలంటూ కూడా పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే నిన్న జగన్.. నేడు పవన్.. రేపు మరవరో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: