ఆంధ్రప్రదేశ్ లో వైసిపి , టిడిపి పార్టీ అధినేతలు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. 2019 ఎన్నికలలో 175 నియోజవర్గాలలో వైసిపి 151 నియోజకవర్గాలను గెలిచి ఒక రికార్డును సృష్టించింది.. మళ్లీ ఇలాంటి రికార్డు ఏదైనా రాజకీయ పార్టీకి సాధ్యమా అంటే అది చెప్పలేని విషయం.. అయితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసిపి వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తోంది.. ఆ వైపు గానే అందుకు తగ్గ కార్యచరణ కూడా చేపడుతూ ఉన్నది. ఈ విషయాన్ని ఏడాది క్రితమే సీఎం జగన్ కొనసాగిస్తూ ఉన్నారు ...


పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ లు  కూడా ఇస్తూ గడపగడపకి వైసీపీ అనే కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇలా ఇంటింటికి వైసీపీ ప్రజా ప్రతినిధులు కూడా వెళుతూ ఉన్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు వై నాట్ 175 అంటున్నప్పటికీ లోపల మాత్రం 100 సీట్లు గెలిస్తే చాలని చెప్పుకుంటున్నారట. కచ్చితంగా 90 సీట్లు గెలిచినా కూడా అధికారం మళ్లీ వైసీపీ పార్టీదే వస్తుందని,  దీంతో టిడిపి పార్టీ శాశ్వతంగా సమాధి అయిపోతుందనే భావన కూడా వైసిపి నేతలలో కనిపిస్తోంది.


ప్రస్తుతం పొలిటికల్ పరిస్థితి ఎలా ఉందంటే వైసీపీకి ఏమాత్రం కూడా అనుకూలంగా కనిపించడం లేదు.. వైసీపీ నుంచి ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు,  ఎమ్మెల్సీలు ఇతర పార్టీలోకి వెళ్లడం ప్రారంభమైందో అప్పటినుంచి కాస్త వైసిపి పార్టీ హవ తగ్గింది. టిడిపి, జనసేన,  బిజెపి కూటమి వల్లే వైసీపీ పార్టీకి చాలా దెబ్బ పడుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరు గెలిచినా కూడా కచ్చితంగా పార్టీల ఫిరాయింపులు అనేవి అనూహ్యంగా ఉండబోతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.. ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేకపోయినా చివరికి కెసిఆర్ గెలుస్తారనుకున్నప్పటికీ.. లోక్సభ ఎన్నికల బరిలో వచ్చేసరికి గులాబీ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితి ఎదురయ్యింది. మరి ఆంధ్రాలో అలాంటి పరిస్థితి ఏ పార్టీకి ఎదురవుతుందనే సందేహం వ్యక్తం అవుతోంది.. అయితే ఈసారి ఎలాగోలాగా వైసీపీ పార్టీ 100 సీట్లు గెలిస్తే చాలని ఆలోచనలో పడ్డారు వైసీపీ శ్రేణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: