ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై రాళ్ల దాడులు జరిగాయి. అయితే జగన్ కు మాత్రం గాయం కాగా చంద్రబాబు, పవన్ లకు గాయాలు కాలేదు. అయితే ఏపీలో రాళ్ల రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయ నేతలపై రాళ్లు వేసేంత కోపం ప్రజల్లో నిజంగానే ఉందా? అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. జగన్ పై జరిగిన దాడి మాత్రం నిజంగా జరిగిన దాడి అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
గతంలో పలువురు రాజకీయ నేతలపై గుడ్లు, టమోటాలు విసిరిన సందర్భాలు ఉండగా రాళ్ల దాడులు మాత్రం ప్రధాన రాజకీయ నేతలను ఒకింత కలవరపెడుతున్నాయి. ఈ రాళ్ల దాడులు పార్టీపై అభిమానంతో అవతలి పార్టీ నాయకులపై చేసిన దాడులే తప్ప వ్యక్తిగత కక్షతో చేసిన దాడులు అయితే కావని సమాచారం అందుతోంది. జగన్ పై దాడి కేసులో నిందితుడు దొరికితే రాళ్ల రాజకీయాల వెనుక అసలు వ్యక్తులు ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది.
 
రాళ్ల దాడి కేసులో అసలు నిందితుడు దొరికాడని పోలీసు రహస్య ప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్నాడని ప్రముఖ న్యూస్ ఛానెళ్లు వార్తలను ప్రసారం చేస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అధికారికంగా స్పందిస్తే మాత్రమే జగన్ పై దాడి కేసులో పురోగతి ఉందో లేదో తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు పవన్ పై దాడి చేసిన వ్యక్తి తాను పవన్ అభిమానినని చెప్పుకొచ్చారు.
 
పవన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే నా గురించి తప్పుగా అర్థం చేసుకుని కొంతమంది దాడి చేశారని ఆ వ్యక్తి కామెంట్లు చేశారు. ఏపీలో రాళ్ల దాడులు భవిష్యత్తులో జరగకుండా పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. సీఎం జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. జగన్ పై దాడి కేసు రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: