హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతం. ఒకప్పుడు చిన్నపాటి గ్రామం. హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం సింగపుర్ ను తలపించింది. ఐటీ కంపెనీల ఏర్పాటు తోనే ఇదంతా సాధ్యమైంది. న్యవాంధ్ర రాజధాని ప్రాంత మంగళగిరిలోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మంగళగిరి కూడా మరో సింగపుర్ లా మారేదే.


కానీ సీఎం జగన్ అందివచ్చిన అవకాశాలను కాలదన్నారు. కొత్త కంపెనీలను తీసుకురాకపోగా ఉన్నవాటిని వెళ్లగొట్టారు. దీంతో ఈ ప్రాంత యువత ఉద్యోగాలకు దూరం అయింది. రాష్ట్ర విభజన తర్వాత ఐటీ రంగ అభివృద్దిని సవాల్ గా తీసుకున్న చంద్రబాబు రాజధాని ప్రాంతాలైన మంగళగిరి, గుంటూరు, అమరావతి లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలను ఆహ్వానించారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి ఐటీ పరిశ్రమలకు బాటలు వేశారు.


కానీ ఇంతలోనే ప్రభుత్వం మారడంతో అక్కడ నుంచి ప్రముఖ కంపెనీలు తరలిపోయాయి. వేల మంది ఉద్యోగులు ఉపాధి కోసం వలసపోయారు. దీంతో బహుళ అంతస్తుల భవనాలు నిరుపయోగంగా మారాయి. ఇది మంగళగిరి గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం. ఇంత వరకు బాగానే ఉన్నా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీల గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. అసలు ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి. ఏ సంవత్సరం నుంచి ఉన్నాయో వంటి వివరాలను బహిర్గతం చేయడం లేదు.


ఈ కంపెనీలు ఏంటయా అంటే ఫేస్ బుక్ లో లైకులు కొట్టేవి, టీడీపీకి అనుకూలంగా పోస్టులు  పెట్టేవి, ఫేక్ ఐడీలు సృష్టించి దుష్ప్రచారాన్ని ప్రచారం చేసేవి. వాటికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రాయితీల పేరుతో ప్రోత్సాహకాలు ఇస్తూ ఒక్కొక్కరికీ రూ.15-20వేల వరకు జీతాలు ఇచ్చేవని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో పోటీ చేస్తున్న జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ కోర్టులో కేసు వేసి ఈ బోగస్ గుట్టు విప్పారు. కానీ ఇప్పటికీ ఐటీ కంపెనీలు తరలిపోయాయనే అబద్ధపు వార్తలను ఇంకా ప్రసారం చేస్తున్నాయి పలు వార్తా ఛానళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: