గత ఎన్నికల్లో భీమవరం, గాజు వాకల్లో ఓటమిపాలైన పవన్ కల్యాణ్..  ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. అందుకే తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. ఇప్పటికే అక్కడ నాలుగు రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించిన జనసేనాని.. స్థానికంగ నివాసం ఉండేలా ఒక అద్దె ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంలో స్టార్ క్యాంపెయినర్స్ ని కూడా రంగంలోకి దించారు.


ఇదే సమయంలో తన గెలుపు బాధ్యతను పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జి ఎస్.వి. వర్మ చేతుల్లో పెడుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో మరోసారి పవన్ ను ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకొంది. ఇప్పటికే వంగా గీత ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తుంటే.. మరోవైపు ముద్రగడ పద్మనాభం రూపంలోను గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అదే విధంగా ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్ ఛార్జి మిథున్ రెడ్డి సైతం పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించారు.


ఈ సందర్భంగా మిథున్ రెడ్డి పిఠాపురంలో గెలుపు వ్యూహాలు రచించడానికి పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర అంశాన్ని వంగా గీత ప్రచార అస్త్రంగా మలచుకున్నారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు, కులం కార్డు ప్రయోగించకుండా కేవలం తాను స్థానిక అభ్యర్థిని అని ప్రచారం చేసకుంటున్నారు. పవన్ రాకముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేయడం ఆమెకు సానుకూలాంశం.


ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు. ఆయన్ను ఆ పార్టీ క్యాడరే చేరుకోలేదు. గీత నిత్యం ప్రజల్లో ఉంటారు. ఇబ్బందులు ఉంటే ప్రజలు ఎవర్ని కోరుకుంటారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారు. పవన్ ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు. ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ విషయంలో వైసీపీ వ్యూహాత్మంగానే స్థానికతను తెరపైకి తెచ్చిందని విశ్లేషిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: